/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-13-6.jpg)
Delhi : ఢిల్లీ మెట్రో (Delhi Metro) లో మహిళా ప్రయాణికులు (Women Passengers) మరోసారి కొట్టుకున్నారు. ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో ట్రైన్ (Metro Train) లో ఇద్దరు యువతుల మధ్య నిలబడే ప్లేస్ కోసం వాగ్వాదం జరిగింది. మాట మాట పెరిగి ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. చేతులు విరుచుకుంటూ, బూతులు తిట్టుకున్నారు. దీంతో పక్కనే ఉన్న ప్రయాణికులు కల్పించుకుని ఇద్దరికీ సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఈ వీడియో సోషల్ మీడియా (Social Media) లో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే వైరల్ అయింది. దీనిపై ఫన్నీ కామెంట్స్ పేలుతున్నాయి. ఢిల్లీ మెట్రోలో ఇలాంటి సంఘటనలు తరచుగా జరుగుతాయంటూ జోకులు పేలుస్తున్నారు.
Kalesh b/w Two Ladies Inside Delhi Metro over Push and Shove
pic.twitter.com/yLgV3DgiWH— Ghar Ke Kalesh (@gharkekalesh) May 24, 2024
Also Read : మీ మొబైల్ పోయిందా..చింతించకండి..ఇలా చేసి తిరిగి పొందండి!