/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/kavitha-with-ktr-jpg.webp)
Delhi Liquor Scam Case Kavitha Arrest Updates : ఒక్కసారిగా దేశంచూపు ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) వైపు మళ్లింది. ఈ కేసులో కేసీఆర్(KCR) కుమార్తే, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత(BRS MLC Kavitha) ను ఈడీ(ED) అదుపులోకి తీసుకోవడం టాక్ ఆఫ్ ది నేషన్(Talk Of The Nation) గా మారింది. హైదరాబాద్‌లోని కవిత ఇంట్లో నాలుగు గంటలకు పైగా సోదాలు చేసిన ఈడీ, ఐటీ అధికారులు ముందుగా వారెంట్ జారీ చేసి అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్(Hyderabad) నుంచి ఢిల్లీకి తీసుకెళ్లారు. ఇవాళ(మార్చి 16) రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపర్చనుండగా.. ఈడీ అరెస్ట్‌ను ఛాలెంజ్ చేస్తూ కేసీఆర్ కుమార్తే సుప్రీంకోర్టు గడప తొక్కనున్నట్టు తెలుస్తోంది.
BRS leader Kavitha arrested by ED in Delhi liquor policy money laundering case at 5:20 PM. pic.twitter.com/7KlFrlej7I
— Arvind Gunasekar (@arvindgunasekar) March 15, 2024
కవిత వాంగ్మూలం నమోదు:
సుప్రీంకోర్టు(Supreme Court) లో అత్యవసర విచారణను కోరేందుకు కవిత న్యాయ బృందం ప్రయత్నిస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అటు పీఎంఎల్ఏ 2002లోని సెక్షన్-3 ప్రకారం కవిత దోషిగా తేలారని.. సెక్షన్ 4 కింద శిక్షార్హురాలని ఈడీ అరెస్టు మెమోలో పేర్కొంది. ఇక పీఎంఎల్ఏ సెక్షన్ 17 కింద కవిత వాంగ్మూలం నమోదైంది. కవితను అరెస్టుకు సంబంధించి 14 పేజీల కాపీని ఆమెకు అందజేసినట్లు మెమోలో పేర్కొన్నారు.
ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు ఈడి అధికారులతో ktr వాగ్వాదం pic.twitter.com/5Mwv7TiHho
— HEMA NIDADHANA (@Hema_Journo) March 15, 2024
కేటీఆర్ వాగ్వాదం:
నిన్న(మార్చి 15) సాయంత్రం 5గంటల20 నిమిషాలకు కవితను ఈడీ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కవిత అరెస్ట్ తర్వాత ఆమె సోదారుడు, ఎమ్మెల్యే కేటీఆర్ ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగిన వీడియో వైరల్‌గా మారింది. కవితను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలించేందుకు ట్రాన్సిట్ రిమాండ్ ఉందా అని కేటీఆర్ ఈడీ అధికారులను ప్రశ్నించారు. అందుకే పంచనామాలో కేటీఆర్ గురించి కూడా అధికారులు ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. క్రిమినల్ జస్టిస్ డెలివరీ సిస్టమ్ లో పంచనామా అనేది కీలకమైన డాక్యుమెంట్. ఇది సాక్షులు సమక్షంలో జరిగే కొన్ని సంఘటనలను నమోదు చేస్తుంది. దర్యాప్తు సమయంలో నమోదు చేసిన 'పంచనామా'ను బట్టి దర్యాప్తు సంస్థ నిజాయతీని, కచ్చితత్వాన్ని నిర్వచించవచ్చని చెబుతుంటారు.
మరోవైపు ఎన్నికల తేదీలు ప్రకటించడానికి ఒక్క రోజు ముందు(ఇవాళ మధ్యాహ్నం ఎన్నికల నోటిఫికేషన్ రానుంది) కవిత అరెస్టుకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసన చేపట్టనుంది.
Also Read : కవిత అరెస్టుకు కారణాలేంటి? అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటి?