ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైల్లోని జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. తనను ఈడీ అరెస్టు చేసి.. రిమాండ్‌కు తరలించడంపై గతంలో ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌పై మంగళవారం న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటలకు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈ కేసుపై కీలక తీర్పు వెలువరించనున్నారు.
Also Read: తాతకు అదిరిపోయే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన మనవడు.!
ప్రస్తుతం కేజ్రీవాల్ తీహార్ జైలులో 2వ నెంబర్ సెల్‌లో ఉన్నారు. దేశంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తన పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే ఇలా అరెస్టు చేయించారని.. కేజ్రీవాల్ తరఫు న్యాయవాది ఇప్పటికే కోర్టులో వాదనాలు వినిపించారు. అయితే ఢిల్లీ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేదానిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు కేజ్రీవాల్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని దాఖలైన మరో పిటిషన్‌ను సోమవారం ఉదయం ఢిల్లీ హైకోర్టు విచారించింది. ఇది పబ్లిసిటీ స్టంట్ అని.. ఈ పటిషన్ దాఖలు చేసిన ఆప్ మాజీ ఎమ్మెల్యే సందీప్ కుమార్‌పై న్యాయస్థానం విరుచుకుపడింది.
Also read: ఎయిర్ స్ట్రిప్‌పైకి దూసుకొచ్చిన ఎద్దు.. వీడియో వైరల్!
మళ్లీ ఇలాంటి పిటిషన్లు వేస్తే.. భారీ జరిమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ సందీప్ కుమార్‌ను హెచ్చరించింది. అయితే ఈ పిటిషన్‌ను కూడా మంగళవారం రోజు విచారణ చేయనుంది. ఇదిలాఉండగా.. మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న సమయంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇక ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మే 13న జరగనున్నాయి. అయితే ఈసారి ప్రజలు.. కేంద్రలో ఎవరికి అధికారం అప్పగిస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.