Delhi High Court: కాంగ్రెస్ కు షాక్.. ఖాతాల ఫ్రీజింగ్ మీద పిటిషన్ కొట్టివేత కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలను ఐటీ శాఖ ఇటీవల ఫ్రీజ్ చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. అయితే ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. By Manogna alamuru 22 Mar 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Delhi High Court Rejects Congress Petition: కాంగ్రెస్ ఖాతాలన్నింటినీ ఇటీవల ఐటీ శాఖ ఫ్రీజ్ చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. అయితే ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ఎన్నికల ముందు ఖాతాల ఫ్రీజింగ్.. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొన్ని బ్యాంకు ఖాతాలను ఆదాయ పన్ను శాఖ నిలిపివేసినట్లు.. ఆ పార్టీ నేతలు తెలిపారు. అంతేకాదు ఐటీ శాఖ వాళ్లు ఫ్రీజ్ చేసిన వాటిలో యూత్ కాంగ్రెస్ ఖాతా కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. పన్ను కట్టలేదనే కారణంతో అకౌంట్లను ఫ్రీజ్ చేశారని ఇందులో రాజకీయ దురుద్దేశం కనిపిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. దీంతో ఈ అంశం రాజకీయంగా పెను దుమారం రేపింది. ఆదాయపు పన్ను శాఖ కాంగ్రెస్ నాలుగు ప్రధాన బ్యాంకు ఖాతాలను పలు కారణాలతో స్తంభింపజేసిందని ఆ పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ పేర్కొన్నారు. ఇది పార్టీ రాజకీయ కార్యకలాపాలన్నింటినీ ప్రభావితం చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు రెండు వారాల ముందు కాంగ్రెస్ ఖాతాలను ఫ్రీజ్ చేసింది ఐటీ శాఖ. రాహుల్ ఆగ్రహం.. ఖాతాలను ఫ్రీజ్ చేయడం పట్ల నిన్న కాంగ్రెస్ ముఖ్యనేతలు మీడియా సమావేశం పెట్టి మరీ తమ ఆవేదనను వెళ్ళబుచ్చారు. కాంగ్రెస్ అకౌంట్లను ఫ్రీజ్ చేయడం దారుణమని రాహుల్ మండిపడ్డారు. పెద్ద పెద్ద విషయాలను వదిలేయండి..కనీసం తాము తమ అకౌంట్ నుంచి రెండు రూపాలయను కూడా ఖర్చు పెట్టలేకుండా చేశారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా కాంగ్రెస్ అకౌంట్స్‌ను ఫ్రీజ్ చేశారు. రాజ్యాంగ సంస్థల్ని కూడా దుర్వినియోగం చేస్తున్నారు. నిజానికి ఇది మా ఖాతాలను సీజ్ చేయడం కాదు…ప్రజాస్వామ్యాన్ని సీజ్ చేయడం అని రాహుల్ ఆరోపించారు. తమపై క్రిమినల్ యాక్షన్ తీసుకుంటున్నారు…కాంగ్రెస్‌ను ఆర్థికంగా దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తున్నారని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరిగినా ఈడీ దీని మీద స్పందించడంలేదని ఆరోపించారు. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు కూడా ఈ కేసును కొట్టేసింది. Also Read:Aravind Kejriwal: అవినీతికి వ్యతిరేకంగా పోరాటం..చివరకు అదే ఆరోపణలతో అరెస్ట్..కేజ్రీవాల్ ప్రస్థానం ఇదే.. #electoral-bonds #delhi-high-court #petition #congress మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి