కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. తదుపరి విచారణను రేపు మధ్యాహ్నం 12.00 గంటలకు ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. ఈరోజు కవిత తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. రేపు సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థలు తమ వాదనలు వినిపించనున్నాయి. ఇదిలాఉండగా.. అనారోగ్య కారణాల వల్ల తనకు బెయిల్ ఇవ్వాలని ఇటీవల కవిత ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
Also Read: కొనసాగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
PMLA సెక్షన్ 45 ప్రకారం బెయిల్ పొందేందుకు తాను అర్హురాలునని కవిత పిటిషన్‌లో వివరించారు. కానీ ఆమెకు మాత్రం బెయిల్ ఇవ్వొద్దని ఈడీ, సీబీఐ అధికారులు కోర్టుకు చెబుతున్నారు. ఇప్పటికే ట్రయల్ కోర్టు కవితకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కవితకు బెయిల్ వస్తుందా? రాదా? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. హైకోర్టులో బెయిల్ రాకపోతే కవిత సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కవిత తిహార్ జైల్లో జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు .