Kejriwal: కేజ్రీవాల్‌కు దక్కని ఊరట..ఈనెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటూ డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు చుక్కెదురు అయింది. కేజ్రీవాల్ కస్టడీని కూడా పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు చెప్పింది. ఈనె ల23 వరకు కేజ్రీవాల్ జ్యూడీషియల్ కస్టడీని పొడిగించింది కోర్టు.

New Update
Kejriwal: కేజ్రీవాల్‌కు దక్కని ఊరట..ఈనెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

Arvind Kejriwal Judicial Custody: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన నిందితులకు అస్సలు ఊరట లభించడం లేదు. పొద్దున బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితలకు (MLC Kavitha) రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తే ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కస్టడీని పొడిగింది కోర్టు. ఈనెల 23 వరకు కేజ్రీవాల్ కస్టడీని పొడిగించాలని కోర్టు ఆదేశించింది. దీంతో పాటూ ఆయనకు సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురు అయింది. అరెస్టును సవాల్‌ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై తక్షణ విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దీనిపై ఈడీకి నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Also Read: Salman Khan : నెల రోజుల నుంచీ అమెరికాలో కుట్ర.. సల్మాన్ ఇంటి బయట కాల్పులకు ప్లాన్ ఇలా..

అంతకు ముందు కూడా తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్లను ఢిల్లీ హైకోర్టుతో పాటూ సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది. ఈరోజు సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ తరుఫు న్యాయవాది అత్యవసర పిటిషిన్‌నే వేశారు. ఇందులో కేజ్రీవాల్ అరెస్ట్‌ను సవాల్ చేయడమే కాక ఆయనకు న్యాయసలహాలు తీసుకునే సమయం పెంచాలంటూ కోరారు. లిక్కర్‌ స్కాం కేసులో అరెస్ట్ అయిన తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఆయన లాయర్‌కు వారానికి రెండు సార్లు ఛాన్స్ ఇస్తున్నారు. అయితే.. ముఖ్యమంత్రిగా విధులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఇది సరిపోవడం లేదని...అందుకే తనకు లాయర్ని కలిసేందుకు వారానికి ఐదుసార్లు ఛాన్స్ ఇవ్వాలని పిటిషన్లో కోరారు. కానీ దీన్ని సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. కోర్టు దానికి అనుమతి ఇవ్వలేదని తేల్చి చెప్పింది. ఇక అరెస్ట్‌ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ గురించి తనకు మెయిల్ చేయాలని కేజ్రీవాల్ న్యాయవాదికి సీజేఐ చంద్రచూడ్ సూచించారు.

Advertisment
తాజా కథనాలు