Coaching Centre Tragedy: ఢిల్లీ కోచింగ్ సెంటర్ విషాద ఘటన.. విద్యార్థుల నిరసనలు

ఢిల్లీలోని ఐఏఎస్ స్టడీ సెంటర్‌లోకి వరద పోటెత్తడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై అక్కడి విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

New Update
Coaching Centre Tragedy: ఢిల్లీ కోచింగ్ సెంటర్ విషాద ఘటన.. విద్యార్థుల నిరసనలు

ఢిల్లీ రాజిందర్‌నగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. రావ్‌ ఐఏఎస్ స్టడీ సెంటర్‌లోకి వరద పోటెత్తడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై అక్కడి విద్యార్థులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ స్నేహితులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపిస్తున్నారు. చిన్నపాటి వర్షాలకే వరదలు వస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. 12 రోజుల క్రితమే ఈ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉందని కౌన్సిలర్‌కు ఫిర్యాదు చేశామని.. వాళ్లు వెంటనే చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: నేటినుంచి మావోయిస్టు వారోత్సవాలు.. ఆ ప్రాంతాలను జల్లెడ పడుతున్న పోలీసులు!

ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ.. కౌన్సిలర్, ఇతర ప్రభుత్వ అధికారులు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఇప్పటికే స్టడీ సర్కిల్ యజమాని, కో ఆర్డినేటర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులు తెలంగాణకు చెందిన తానియ సోని (25), యూపీకి చెందిన శ్రేయా యాదవ్ (25), కేరళకు చెందిన నెవిన్ డాల్విన్‌(28)గా గుర్తించారు. ఇక ఘటనాస్థలానికి చేరుకున్న ఆప్ ఎంపీ స్వాతీ మలీవాల్‌ అధికారులపై మండిపడ్డారు. ప్రమాదం జరిగి 12 గంటలు అవుతున్నా కూడా ఇప్పటిదాకా ప్రభుత్వ అధికారులు, మంత్రులు ఇక్కడికి రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని దుయ్యబట్టారు. మరోవైపు స్వాతీ మహీవాల్‌ను ఘటనాస్థలంలో విద్యార్థులు అడ్డుకున్నారు. దీన్ని రాజకీయ చేయొద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతీ మాలీవాల్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

Also Read: వీడి దుంప తెగ! ఒకే ఒక్కడు.. లక్షల ఎకరాలు తగలెట్టేశాడు!!

శనివారం సాయంత్రం భారీ వర్షాల వల్ల వరద సంభవించిన సమయంలో 18 మందికి పైగా విద్యార్థులు అందులో ఉన్నారని పోలీసులు తెలిపారు. బేస్‌మెంట్ గేట్ మూసివేసి ఉన్నప్పటికీ వరద ఉద్ధృతి ఎక్కువ కావడంతో నీరు లోపలికి ప్రవేశించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు తెలంగాణకు చెందిన విద్యార్థిని తానియా సోని మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌లో ఉంటున్న ఆమె తండ్రికి ఫోన్‌ చేసి మాట్లాడారు. విద్యార్థిని భౌతిక కాయాన్ని తీసుకొచ్చే ఏర్పాట్లు త్వరగా పూర్తయ్యేలా చేస్తామని చెప్పారు.

Advertisment
తాజా కథనాలు