Arvind Kejriwal : మరికాసేట్లో జైలు నుంచి విడుదల కానున్న కేజ్రీవాల్..

మరికాసేపట్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ జైలు నుంచి విడుదల కానున్నారు. గురువారం ఆయనకు రూ.లక్ష పూచికత్తుపై రౌస్‌ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. సాక్షుల్ని ప్రభావితం చేయకూడదని.. విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని న్యాయస్థానం ఆంక్షలు పెట్టింది.

CM Kejriwal: సీఎం కేజ్రీవాల్‌కు బెయిలా? జైలా?
New Update

Tihar Jail : మరికాసేపట్లో ఢిల్లీ (Delhi) సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) జైలు నుంచి విడుదల కానున్నారు. గురువారం ఆయనకు రూ.లక్ష పూచికత్తుపై రౌస్‌ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. బెయిల్ బాండ్లను కోర్టులో సమర్పించిన అనంతరం కేజ్రీవాల్ బయటకి వస్తారు. అయితే విచారణకు ఆటంకం కలిగించకూడదని.. సాక్షుల్ని ప్రభావితం చేయకూడదని న్యాయస్థానం ఆంక్షలు పెట్టింది. అలాగే ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు సహరించాలని ఆదేశాలు జారీ చేసింది.

Also Read: తమిళనాడులో కల్తీసారా కలకలం.. 40కి చేరిన మృతుల సంఖ్య

ఇదిలాఉండగా మార్చి 21న ఢిల్లీ లిక్కర్‌ పాలసీ (Delhi Liquor Scam) కి సంబంధించి మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్ అరెస్టయిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆయనకు మే 10 నుంచి జూన్ 1 వరకు కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత ఆయన సరెండర్ అయిపోయారు. ఆ సమయంలో సీఎంగా విధులు నిర్వహించకూడదని కోర్టు ఆంక్షలు పెట్టింది. అయితే తాజాగా రెగ్యులర్ బెయిల్ రావడంతో ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌ బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంటుంది. మరోవైపు తమ పార్టీ నాయకుడు బయటకు రావడంతో ఆప్‌ (AAP) నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సత్యం గెలిచిందంటూ సంబరాలు చేసుకుంటున్నారు.

Also Read: భారత్ లో ఏఐ అసిస్టెంట్‌ ఎన్ని భాషల్లో అందుబాటులో ఉందంటే!

#telugu-news #national-news #arvind-kejriwal
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe