Arvind Kejriwal : నా భర్తకు మద్దతు ఇచ్చేందుకు ఈ నెంబర్‌కు మెసేజ్‌ చేయండి : సునీతా

సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ నియంత శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని ఆయన సతీమణి సునీతా అన్నారు. ఆయన కోసం 8297324624 వాట్సప్‌ నెంబర్‌కు మీ సందేశాలు పంపించాలని.. మీ ప్రేమ, ఆశీర్వాదలను ఆయనకు చేరవేరుస్తానని పేర్కొన్నారు.

New Update
Kejriwal: కేజ్రీవాల్‌ తో భార్య ములాఖత్‌ రద్దు!

Sunita : లిక్కర్ స్కామ్ కేసు(Liquor Scam Case) లో అరెస్టయిన ఢిల్లీ(Delhi) సీఎం అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) ప్రస్తుతం ఈడీ(ED) కస్టడిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్‌(Sunita Kejriwal) మరో వీడియో సందేశాన్ని విడుదల చేశారు. దేశంలో అత్యంత అవినీతి, నియంత శక్తులకు వ్యతిరేకంగా తన భర్త పోరాటం చేస్తున్నారని.. ఇందుకోసం ఆయనకు అండగా నిలబడేందుకు ప్రజల ఆశీర్వాదం కావాలని కోరారు. అంతేకాదు ఓ వాట్సప్‌ నెంబర్‌ను కూడా షేర్‌ చేసి దీనికి మీ సందేశాలు పంపిచండని తెలిపారు.

Also Read : చిరకాల ప్రత్యర్థిపై చేసిన ట్రిపుల సెంచరీకి 20 ఏళ్లు!

' నా భర్త అసలైన దేశభక్తుడు. కోర్టులో నిజాలను బయటపెట్టాలంటే చాలా ధైర్యం అవసరం. ఇప్పుడు దేశంలో ఉన్న నియంత శక్తులకు సవాల్ చేస్తున్నారు. ప్రస్తుతం మనమందరం ఆయనకు మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ఈరోజు నుంచి మేము ఓ ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించనున్నా. అరవింద్ కేజ్రీవాల్‌ కోసం 8297324624 వాట్సప్‌ నెంబర్‌కు మీ సందేశాలు పంపించండి. అవన్నీ కూడా నేను ఆయనకు చేరవేరుస్తాను. మీరు చూపించే ప్రేమ, ఆశీర్వాదాలతో ఆయన ధైర్యంగా ఉంటారని' సునిత వీడియో సందేశంలో వివరించారు.

ఇదిలా ఉండగా.. లిక్కర్‌ పాలసీకి సంబంధించిన కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి అనుమతితో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ స్వయంగా తన వాదనలు వినిపించారు. కేవలం నాలుగు వాంగ్మూలాలతో మాత్రమే తనను అరెస్టు చేశారని అన్నారు. అలాగే సునీత కేజ్రీవాల్‌ కూడా నిన్న కోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తన భర్త ఆరోగ్యం బాలేదని.. అలాగే ఈడీ అధికారులు కూడా ఆయనను వేధిస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read : కాంగ్రెస్ ఖాతాలు ఫ్రీజ్‌, కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించిన ఐక్యరాజ్యసమతి

Advertisment
తాజా కథనాలు