Delhi Boy : ఆ పిల్లాడు అంతకు ముందే చనిపోయాడు.. హరిద్వార్ ఘటనలో బయటపడ్డ నిజాలు

నిన్న హరిద్వార్‌లో జరిగిన ఓ ఘటన అందరినీ విషాదంలో ముంచెత్తింది. కన్న తల్లిదండ్రులే తమ ఐదేళ్ళ పిల్లాడిని గంగానదిలో ముంచి చంపారు అంటూ ఆరోపణలు వచ్చాయి. కానీ ఈరోజు పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో గంగలో మునగక ముందే పిల్లాడు చనిపోయాడని తేలింది.

Delhi Boy : ఆ పిల్లాడు అంతకు ముందే చనిపోయాడు.. హరిద్వార్ ఘటనలో బయటపడ్డ నిజాలు
New Update

Haridwar : కొన్ని కొన్ని ఘటనలు అంతులేని విషాదాన్ని మిగులుస్తాయి. అలాంటిదే నిన్న జరిగిన సంఘటన కూడా మూఢనమ్మకంతో హరిద్వార్‌లో (Haridwar) తల్లిదండ్రులు తమ ఐదేళ్ళ కొడుకు గంగానది(Ganga River) లో ముంచి చంపేశారని వార్తలు వచ్చాయి. బ్లడ్ కేన్సర్‌(Blood Cancer)తో బాధపడుతున్న తమ కొడుకును గంగానదిలో స్నానం చేయిస్తే అతని వ్యాధి నయం అవుతుందనే నమ్మకంతో తల్లిదండ్రులు అదే పనిని చేశారు. కానీ దురదృష్టవశాత్తు గంగానదిలో ముంచి తీసేప్పటికి ఆ పిల్లాడు చనిపోయాడు. దీంతో అందరూ ఆ పేరెంట్సే కుర్రాడిని చంపేశాంటూ అందరూ తిట్టిపోశారు. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియా(Social Media) లో తెగ వైరల్ అయింది. ఈ ఘటన హరిద్వార్‌లోని హర్‌కీ పౌరిలో చోటుచేసుకుంది.

ఢిల్లీ(Delhi) కి చెందిన ఓ కుటుంబం బుధవారం తమ 5 ఏళ్ల చిన్నారితో కలిసి హర్ కీ పౌరీకి వచ్చారు. చిన్నారి తల్లిదండ్రులతోపాటు ఇతర కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వారు చిన్నారిని గంగానదిలో స్నానానికి తీసుకువెళ్లారు. గంగానది(Ganga River) లో పదేపదే ముంచారు. చివరకు ఊపిరి ఆడక ఆ పిల్లాడు మరణించాడు. అయితే ఘటనా స్థలంలో ఉన్న స్థానికులు కుటుంబీకుల తీరుపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే చిన్నారిని చంపారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కుటుంబసభ్యులు, స్థానికులు మధ్య గొడవ జరిగి అది కాస్త తోపులాటకు దారి తీసింది. తరువాత తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read:సుమతీ శతకం పద్యంతో కేటీఆర్ ట్వీట్..సోషల్ మీడియాలో వైరల్

పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో బయటకు వచ్చిన నిజాలు...

నిన్న చనిపోయిన పిల్లాడికి పోలీసులు పోస్ట్ మార్టం నిర్వహించారు. అయితే అందులో చాలా నిజాలు బయటకు వచ్చాయి. చనిపోయిన పిల్లాడు ఎప్పటి నుంచో లుకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. తల్లిదండ్రులు అతని కోసం చేయవలసిన ప్రయత్నాలు అన్నీ చేసేశారు. చివరి ప్రయత్నంగా మాత్రమే హరిద్వార్‌లోని గంగానదికి తీసుకువచ్చారు. నీటిలో ముంచినప్పుడు చనిపోయాడు. నీటిలో నుంచి బయటకు తీసే సమయానికి పిల్లాడు చనిపోవడంతో అందరూ తల్లిదండ్రులే తమ మూఢ నమ్మకంతో ఎక్కువ సేపు నీటిలో ముంచడం వలన పిల్లాడు చనిపోయాడని అందరూ అనుకున్నారు. కానీ పోస్ట్ మార్టంలో తేలిన విషయం ఏంటంటే...నీళ్ళల్లో ముంచకముందే కుర్రాడు చనిపోయాడు. అప్పటికే అతనిలో ఉన్న లుకేమియా పూర్తిగా తినేసింది. దాని కారణంగా చనిపోయాడు అని. కేవలం నీటిలో మునిగినప్పుడు చనిపోవడం అనేది యాదృచ్ఛికమే అని తేల్చారు డాక్టర్లు.

కారు డ్రైవర్ చెప్పిన విషయం...

కారు డ్రైవర్ కూడా ఇదే విషయాన్ని దృవీకరించారు. పిల్లాడిని హరిద్వార్ తీసుకువచ్చిన డ్రైవర్‌ను పోలీసులు ప్రశ్నించారు. అందులో... కారులో వస్తున్నప్పుడే పిల్లాడు అస్సలు బాలేడని...శరీరం మొత్తం వనికిపోతూ చాలా అవస్థ పడుతున్నాడని కారు డ్రైవర్ చెప్పారు. అప్పటికే ఆ అబ్బాయి పరిస్థితి చేయి దాటిపోయిందని తెలిపారు. ఏ క్షణంలో అయినా తమ పిల్లాడు బాగుపడతాడనే ఆశతోనే తల్లిదండ్రులు అతనిని గంగానది దగ్గరకు తీసుకువచ్చి స్నానం చేయించారని అన్నారు.

తల్లిదండ్రుల ఆవేదన...

ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ కన్న కొడుకు చనిపోయాడు. సర్ గంగారామ్ ఆసుపత్రిలో వైద్యులు పిల్లాడిని పట్టించుకోలేదు. పెద్ద పెద్ద వైద్యులు చేయించే స్థోమత లేదు. ఇక తాము చేయగలిగినవన్నీ చేశారు. చివరకు భగవంతుడి మీద, నమ్మకం మీద భారం వేశారు. కానీ అది కూడా నెరవేరలేదు సరికదా...వారిని కూడా జైలుకు చేర్చింది. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఒక వైపు కొడుకు చనిపోయాడనే దుఃఖం తినేస్తోంటే...మరొకవైపు తామే పిల్లాడిని చంపేశారని నిందలు మోయడం, జైలుకు వెళ్ళడ్డంతో వారు మరింత కృంగిపోయారు. ఇలాంటి బాధ ఏ తల్లిదండ్రులకూ ఉండకూడదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఇందులో నుంచి ఎలా బయటపడగమో తెలియదంటూ కంటికీ మంటికీ ఏడుస్తున్నారు.

#ganga-river #haridwar #5-years-boy #delhi-boy #delhi-boy-with-cancer
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe