Delhi Air Quality: ఢిల్లీలో తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం.. వరుసగా 3 రోజులు ఇదే పరిస్థితి

ఢిల్లీలో వరుసగా ముడో రోజు వాయు కాలుష్యం తీవ్రస్థాయిలోనే ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌ రాయ్ కేంద్రానికి లేఖ రాశారు. సీఎన్‌జీ, విద్యుత్తు, బీఎస్‌ 4 వాహనాలకు మాత్రమే రోడ్లపై అనుమతి ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు.

New Update
Delhi Air Quality: ఢిల్లీలో తీవ్ర స్థాయిలో వాయు కాలుష్యం.. వరుసగా 3 రోజులు ఇదే పరిస్థితి

Delhi Air Quality: దేశ రాజధాని ఢిల్లీ నగరం కాలుష్య కోరల్లో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటికే వరుసగా మూడురోజులుగా వాయు కాలుష్యం అతి తీవ్రస్థాయిలోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇక శనివారం ఉదయం నాటికి చూసుకుంటే వాయు నాణ్యత సూచీ (AQI) 504కి చేరిపోయింది. జహంగీర్‌పురిలో ఈ సూచీ 702, సోనియా విహార్‌లో 618కి పడిపోవడాన్ని చూస్తే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతోంది. మరోవైపు ఢిల్లీలో విష వాయువుల గాఢత (పీఎం) 2.5 స్థాయిలోనే ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. వాస్తవానికి ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) జారీ చేసినటువంటి ప్రమాణాల కంటే దాదాపు 80 రెట్లు అధికంగా ఉంది. అయితే ఈ గాలిని పీల్చుకోవడం వల్ల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురికావడం, అలాగే కంటి దురద, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటికే అధికారులు ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతాన్ని అతి తీవ్ర కాలుష్య జోన్‌గా గుర్తించారు. రెండు వారాలపాటు ఇలాంటి పరిస్థితి కొనసాగే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఢిల్లీకి చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టడం, అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండటం ఈ తీవ్ర వాయు కాలుష్యానికి కారణమయ్యాయి.

Also Read: కేజీ ఉల్లిపాయ రూ. 25 లే..ఎక్కడంటే!

ఇదిలా ఉండగా.. ఢిల్లీలో నెలకొన్న ఈ తాజా పరిస్థితులపై ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ (Delhi Environment Minister Gopal Rai) కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. సీఎన్‌జీ, విద్యుత్తు, బీఎస్‌ 4 ప్రమాణాలు కలిగిన వాహనాలకు మాత్రమే రోడ్లపై తిరిగేందుకు అనుమతి ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇక రానున్న దీపావళి పండుగతో పాటు పక్క రాష్ట్రాల్లో పంట వ్యర్థాల కాల్చివేతతో వాయుకాలుష్యం మరింతగా క్షిణించనుందని లేఖలో పేర్కొన్నారు. సమస్య మరింతగా తీవ్రరూపం దాల్చకముందే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని.. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని గోపాల్ కేంద్రాన్ని అభ్యర్థించారు.

Also read: అంబానీని బెదిరించిన వ్యక్తుల అరెస్ట్.. నిందితులు వీరిద్దరే..

Advertisment
తాజా కథనాలు