Sonia Gandhi: ఢిల్లీ నుంచి జైపూర్‌కు షిఫ్ట్ అయిపోయిన సోనియా గాంధీ.. కారణమిదేనట..!

కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఢిల్లీ నుంచి జైపూర్‌కు షిఫ్ట్ అయ్యారు. ఆస్తమాతో బాధపడుతున్న సోనియా గాంధీ.. ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ కారణంగా మారింత ఇబ్బంది పడుతున్నారు. దీంతో వైద్యుల సలహా మేరకు ఆమె ఢిల్లీ నుంచి జైపూర్‌కు షిఫ్ట్ అయ్యారు.

Sonia Gandhi: ఢిల్లీ నుంచి జైపూర్‌కు షిఫ్ట్ అయిపోయిన సోనియా గాంధీ.. కారణమిదేనట..!
New Update

Delhi Air Pollution: కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) దేశ రాజధాని ఢిల్లీ నుంచి జైపూర్‌కు(Jaipur) మకాం మార్చేశారు. గత కొద్ది రోజులుగా ఆమె అక్కడే ఉంటున్నారు. అయితే, రాజస్థాన్(Rajasthan) ఎన్నికల నేపథ్యంలో ఆమె అక్కడే ఉంటున్నారని, ఎన్నికల్లో ప్రచారం కోసమే ఆమె జైపూర్‌కు వెళ్లారనే టాక్ నడుస్తోంది. కానీ, సోనియా గాంధీ జైపూర్‌కు షిఫ్ట్ అవడం వెనుక కారణం వేరే ఉందని తెలుస్తోంది. ఢిల్లీలో రోజు రోజుకు పెరిగిపోతున్న వాయు కాలుష్యం కారణంగానే ఆమె జైపూర్‌కు షిఫ్ట్ అయినట్లు సమాచారం అందుతోంది. ఢిల్లీలో గాలి నాణ్యత రోజు రోజుకు దారుణంగా క్షీణిస్తోంది. ఇప్పటికే అనారోగ్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సోనియా గాంధీ.. ఈ పొల్యూషన్ కారణంగా మరిన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని వైద్యులు అలర్ట్ చేశారట. దాంతో వైద్యుల సలహా మేరకు ఆమె ఢిల్లీ నుంచి జైపూర్ షిఫ్ట్ అయిపోయారని విశ్వసనీయ వర్గాల సమాచారం.


సోనియా గాంధీ చాలా కాలంగా ఆస్తమాతో బాధపడుతున్నారు. చాలాసార్లు విదేశాలకు వెళ్లి చికిత్స కూడా తీసుకున్నారు. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ అవడంతో.. ఎఫెక్ట్ ఆమై పడింది. దాంతో.. ఢిల్లీలోని విషపూరితమైన గాలి ప్రమాదకరమని, సోనియాను ఇతర ప్రాంతానికి వెళ్లాలని వైద్యులు సూచించారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ కారణంగానే ఆమె జైపూర్‌కు షిఫ్ట్ అయిపోయారని అంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు.

publive-image

నవంబర్ 14న భారత తొలి ప్రధాన మంత్రి జవహార్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించేందుకు సోనియా గాంధీ శాంతివన్‌ మెమోరియల్ వద్దకు వచ్చారు. ఆ సమయంలోనూ ఆమె మాస్క్ ధరించి ఉన్నారు. సోనియా వెంట కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా ఉన్నారు. కార్యక్రమం అనంతరం సోనియా మళ్లీ జైపూర్‌కు వెళ్లిపోయారు. అయితే, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సోనియా గాంధీ పాల్గొనడం లేదని పార్టీ శ్రేణులు చెబుతున్నారు. రాహుల్, ప్రియాంక గాంధీలే ఎన్నికల బాధ్యతలను చూస్తున్నట్లు తెలిపారు. కాగా, సోనియా గాంధీ ఢిల్లీ నుంచి వేరే చోటకు షిఫ్ట్ అవడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఇలాగే ఆమె వేరే చోటకు షిఫ్ట్ అయ్యారు. 2020లో ఢిల్లీలో వాయు కాలుష్యం భారీగా పెరిగింది. ఆ సమయంలోనూ వైద్యుల సలహా మేరకు గోవాకు షిఫ్ట్ అయ్యారు సోనియా గాంధీ.

కాగా, ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) స్థాయిలు నానాటికి దారుణంగా పడిపోతున్నాయి. గాలి పూర్తిగా కాలుష్యమయం అయిపోతోంది. దీపావళి తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగింది. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) ఉదయం 8 గంటలకు 435గా నమోదైంది. ఏక్యూఐ నోయిడాలో 418కి, గురుగ్రామ్‌లో 391కి చేరుకుంది. ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో వేగంగా పెరుగుతున్న కాలుష్యం కారణంగా.. ప్రజలు శ్వాస సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. పొగ మంచు కారణంగా.. రోడ్డు మార్గం కనిపించక వాహనదారులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Also Read:

టీడీపీ నేత బీటెక్ రవికి 14 రోజుల రిమాండ్.. కడప జిల్లా జైలుకు తరలింపు..

నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు.. ఇవాళే చివరి తేదీ.. అప్లై చేశారా?

#congress-party #rajasthan-elections #sonia-gandhi-shifts-to-jaipur #delhi-pollution #sonia-gandhi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి