Defence Minister Rajnath Singh: మోదీ మూడోసారి ప్రధాని అవ్వబోతున్నారు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాజ్‌నాథ్ సింగ్. మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయమని అన్నారు. ఓటమి భయంతో కేజ్రీవాల్ సహా ఇండియా కూటమి నేతలు బీజేపీపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

New Update
Defence Minister Rajnath Singh: మోదీ మూడోసారి ప్రధాని అవ్వబోతున్నారు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు

Defence Minister Rajnath Singh: మధ్యంతర బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈరోజు బీజేపీపై వికృత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. లోక్ సభ ఎన్నికల్లో ఓటమి చెందుతామనే నిరాశలో సీఎం కేజ్రీవాల్ సహా మొత్తం ఇండియా కూటమి నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆప్ తో పాటు ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు అవినీతిలో కూరుకుపోయాయని పేర్కొన్నారు.

ALSO READ: హైదరాబాద్‌ పోలీసులకు మాధవీలత మాస్‌ వార్నింగ్‌

సరైన నాయకత్వాన్ని నిర్ణయించుకోలేని ఇండియా కూటమి పార్టీలు బీజేపీ పై తప్పుడు ప్రచారం చేస్తూ లబ్ది పొందాలని చూస్తున్నాయని ఫైర్ అయ్యారు. వారు బీజేపీ పై చేసే తప్పుడు ప్రచారాల్లో విఫలం అయ్యారని.. ప్రజలు ఇండియా కూటమి నేతలు చెప్పే మాటలను నమ్మడం లేదని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీతో సహా మొత్తం NDA కూటమి ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తోందని.. మోదీ మూడోసారి ప్రధానమంత్రి అయ్యి తన పదవీకాలాన్ని పూర్తి చేయనున్నారని అన్నారు. ఇందులో బీజేపీలోగానీ, ఎన్డీయేలోగానీ, దేశప్రజల్లో గానీ ఎలాంటి సందేహం లేదని వ్యాఖ్యానించారు.

ప్రధాని మోదీజీ రాజకీయాల్లో విశ్వసనీయతకు ప్రతీక అయితే, కేజ్రీవాల్ ది రాజకీయాల్లో విశ్వసనీయత సంక్షోభానికి ప్రతీక అని చురకలు అంటించారు. బీజేపీ మనసులో మోదీ ఉన్నారు, ఈ దేశంలో మోదీజీ నాయకత్వానికి ఉన్న విశ్వసనీయత, ప్రజల మనస్సులో ఆయనకున్న ఆదరణ భారత కూటమి నేతలకు ఏ మాత్రం సరిపోవడం లేదని విమర్శించారు. మూడోసారి ప్రధాని కావడం ద్వారా మోదీజీ అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే తన సంకల్పాన్ని మరింత బలపరుస్తారని, భారతదేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని ఈ దేశం విశ్వసిస్తోంది అని పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు