/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-12T131512.113-jpg.webp)
Deepika Padukone : ఇటీవలే బాలీవుడ్(Bollywood) స్టార్ కపుల్ దీపికా పదుకొణె(Deepika Padukone), రణ్ వీర్ సింగ్(Ranveer Singh) తాము తల్లి దండ్రులం(Parents) కాబోతున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అంబానీ వేడుకల్లో అంబానీ వెడ్డింగ్ వేడుకల్లో తన భర్తతో కలిసి సందడి చేయగా.. ఆ వేడుకల్లో ఆమె బేబీ బంప్(Baby Bump) కనిపించకపోవడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. దీంతో దీపికా ప్రెగ్నెసీకి సంబంధించి రకరకాల ఊహాగానాలకు తెరలేపింది.
దీపికా సరోగసీ
దీపికా బేబీ బంప్ కనిపించకపోవడంతో .. ఆమె సరోగసీ ద్వారా పిల్లకు జన్మనివ్వబోతున్నారు అంటూ సోషల్ మీడియా(Social Media) లో వార్తలు వస్తున్నాయి. కానీ కొంత మంది నెటిజన్లు మాత్రం దీనిలో ఏ మాత్రం నిజం లేదని కొట్టిపారేస్తున్నారు. దీపికా ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసి ఇంకా.. కొన్ని రోజులు కూడా కాలేదు. అప్పుడే బేబీ బంప్ ఎలా కనిపిస్తుంది. అయినా ఫస్ట్ ట్రైమిస్టర్ లోనే మార్పులు తెలియకపోవచ్చు. ఆ మాత్రం దానికే ఆమె సరోగసీ ఎంచుకున్నారు అనడంలో అర్ధం లేదని అంటున్నారు.
View this post on Instagram
ఈ మధ్య సెలెబ్రెటీల ఏదీ చేసిన వైరల్ గా మారుతుంది. వాళ్ళు నిజమేంటి అని చెప్పేవరకు కూడా.. ఎవరూ వెయిట్ చెయ్యట్లేదు. సోషల్ మీడియాలో ఎవరికి నచ్చింది వాళ్ళు రాసుకుంటున్నారు. ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళ వ్యక్తిగత విషయం.. ఇలాంటి వాటి పై తెలియని ఆరోపణలు చేయడం సరికాదు. వాళ్ళ ప్రైవెసీనీ కూడా గౌరవించడం చాలా ముఖ్యం. అంతేకానీ నోటికి వచ్చింది మాట్లాడడం.. చేతికి అనిపించింది రాసేయడం మంచి పద్ధతి కాదు. ఏదైనా విషయాన్ని ప్రూఫ్ లేకుండా ఇష్టం వచ్చినట్టు బయట ప్రచారం చేయకూడదు. సెలబ్రేటీలకు కూడా పర్శనల్ స్పేస్ ఇవ్వాలి. వాళ్లు కూడా మనుషులే.
Also Read : Kiran Abbavaram: తన మొదటి సినిమా హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న కిరణ్ అబ్బవరం..!