బాలీవుడ్ లో నీలి కళ్ల సుందరి ఐశ్వర్య రాయ్ తరువాత అంతటి ఫాలోయింగ్ ఉన్న నటి ఎవరైనా ఉన్నారా అంటే అది దీపికా పదుకొణె అని చెప్పవచ్చు. అందం, అభినయం, యాక్షన్ ఎందులోనైనా సరే ముందు ఉన్నాను అంటుంది దీపికా. సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ తో పెళ్లి పీటలు ఎక్కింది.
దీంతో ఆమె కెరీర్ గ్రాఫ్ మరింత ముందుకు సాగింది. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న '' కల్కి 2898 ఏడీ'' తో పాటు '' ఫైటర్ '' అనే సినిమాలో నటిస్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన వ్యక్తిగత విషయాలను వెల్లడించింది. తనకు మంచి అనిపించింది ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఎదుర్కొంటానని వివరించింది.
ఏదైనా విషయం కరెక్ట్ అనిపిస్తే దాని మీదే నిలబడతానని తెలిపింది. నేను ఎవరికీ భయపడలేదు. ఇక ముందు కూడా భయపడను అని గట్టిగా చెప్పింది. గతంలో ఓ సారి జేఎన్ యూ విద్యార్థుల విషయంలో వారికి అండగా నిలబడ్డ..ఆ సమయంలో ఎన్నో బెదిరింపులు కూడా వచ్చాయి. కానీ నేను వేటిని లెక్క చేయలేదని దీపికా వివరించింది.
ఎన్నో విలువలు ఉన్న కుటుంబంలో భయం అనేది తెలియకుండా పెరిగాను. ఏదైనా నా వల్ల తప్పు జరిగి ఉంటే నేను క్షమాపణ చెప్పడానికి ఏమాత్రం వెనకడుగు వేయను, సిగ్గుపడను అని దీపిక వివరించింది. తన కెరీర్ ప్రారంభంలో దీపికా అనుభవించిన కష్టాల గురించి కూడా వివరించింది.
నాకు ఆత్మాభిమానం ఎక్కువ . ఒకరి సంపాదన మీద బతకడం నాకు ఇష్టం ఉండదు. అందుకే నా తిండి నేనే సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నాను. అనుకున్న విధంగానే కష్టపడ్డాను. నాకు సినిమా అంటే పిచ్చి. హీరోయిన్ అవ్వడమే నా టార్గెట్. నాకు వేరే పనిరాదు. ఇండస్ట్రీలో వారసులదే రాజ్యం . నాకు ముందుగా ఎవరూ లేరు. నాకు నేనే బలం అనుకున్నాను. నన్ను నేను కాపాడుకుంటూ..స్ట్రాంగ్ గా తయారు అవుతున్నాను.
ఓ వైపు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ , తీరిక లేకుండా సినిమాల మీద సినిమాలు చేస్తూ బిజీగా ఉంటూ ఓ మార్గాన్ని ఏర్పరచుకున్నాను. నేను వర్క్‌హాలిక్ అని చెప్పుకోవడానికి చాలా గర్వపడతా అని దీపిక చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే దీపికా తన భర్త రణ్‌వీర్ గురించి కూడా మాట్లాడింది. '' ఇద్దరం బిజీ జీవితాలు గడుపుతున్నాం. కొన్ని సార్లు తను అర్థరాత్రి దాటిన తరువాత ఇంటికొస్తాడు.
నేను తెల్లవారు జామునే వెళ్లిపోవాలి కలిసి బతకడానికి సమయం దొరకట్లేదు. అందుకే ఇక నుంచి మా ఇద్దరి కోసం ఓ షెడ్యూల్ పెట్టుకోవాలనుకుంటున్నాం’ అని చెప్పుకొచ్చింది దీపిక. ఇదిలా ఉంటే 2014 లో పలు కారణాలతో మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడినట్లు చెప్పింది.
డిప్రెషన్ లోకి వెళ్లి చాలా రోజుల పాటు ఎన్నో అవస్థలు పడినట్లు తెలిపింది. ఆ తరువాత మానసిక ప్రశాంతత కోసం చాలా ప్రయత్నించినట్లు వివరించింది. నిత్యం పనిలోనే విశ్రాంతి లేకుండా ఉండడం కరెక్ట్ కాదని భావించినట్లు తెలిపింది. అన్నింటికంటే మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం అని గుర్తించినట్లు చెప్పింది.
Also read: చెర్రీ మూవీలో హైబ్రిడ్ పిల్ల..ఇది నిజమేనా?