బ్యూటీ సీక్రెట్ చెప్పేసిన దీపిక.. ఈ రెండు పాటిస్తే చాలు అంటోంది

దీపికా పదుకొణె తన బ్యూటీ అండ్ ఫిట్ నెస్ రహస్యాలు చెప్పేసింది. షెడ్యూల్‌ ఎంత బిజీ ఉన్నా తొమ్మిది గంటలు నిద్రపోతా. ఫుడ్ విషయంలోనూ నియమాలు పాటిస్తా. ఫ్రూట్స్, కూరగాయల జ్యూస్‌ బ్రేక్‌ఫాస్ట్‌. రొటీన్‌ వర్కౌట్స్ చేస్తా. ఒత్తిడి దరిచేరనివ్వను. సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని చెప్పింది.

బ్యూటీ సీక్రెట్ చెప్పేసిన దీపిక.. ఈ రెండు పాటిస్తే చాలు అంటోంది
New Update

బాలీవుడ్‌ స్టార్ యాక్ట్రెస్ దీపికా పదుకొణె తన బ్యూటీ సీక్రెట్స్ ఏంటో చెప్పేసింది. కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఉంటూ తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న ఈ నటి.. ప్రస్తుతం ఒకవైపు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు బిజినెస్‌ల్లోనూ రాణిస్తుంది. యంగ్ హీరో రణ్‌వీర్‌ సింగ్ ను ప్రేమించి పెళ్లాడిన హాటీ స్కిన్‌కేర్‌ ప్రొడక్ట్‌తో ఆంత్రప్రెన్యూర్‌గా మారింది. అయితే రీసెంట్ గా బ్యూటీ ప్రొడక్ట్స్ ప్రమోషన్స్ చేస్తున్న దీపిక తాజా ఇంటర్వ్యూలో తన గ్లామర్ రహస్యంపై ఓపెన్ అయింది.

publive-image

ఈ మేరకు దీపిక మాట్లాడుతూ.. 'నా షెడ్యూల్‌ ఎంత బిజీ ఉన్నప్పటికీ నిద్ర విషయంలో అసలే కాంప్రమైజ్ అవను. గ్లామర్‌ ఫీల్డ్‌లో ఉన్నందున టైమ్ దొరికితే తొమ్మిది గంటలు, రెగ్యులర్‌గా అయితే ఏడు గంటలు, అప్పుడప్పుడు ఎనిమిది గంటలు హాయిగా పడుకుంటా. ఇక ఫుడ్ విషయంలోనూ నియమాలన్నీ తప్పకుండా పాటిస్తా. రుచికరమైన ఆహారం కోసం అందరిలానే నేను వెతుకుతాను. అలాగని దొరికే వరకూ కాళీ కడుపుతో ఉండను. అందుబాటులో ఉన్న ప్రతి ఫుడ్ ఆస్వాదిస్తా. ఫ్రూట్స్, కూరగాయల జ్యూస్‌ నా బ్రేక్‌ఫాస్ట్‌. మధ్యాహ్నం లంచ్‌లోకి బ్రౌన్‌ రైస్‌, పప్పు. కర్రీస్‌లో ప్రొటీన్‌ పదార్థాలు ఉండాల్సిందే. సాయంత్రం స్నాక్స్‌ తప్పదు. రాత్రి అన్నం తక్కువగా తింటాను. జర్నీలో ఉన్నప్పుడు మరిన్ని రూల్స్ పెట్టుకుంటా. డైట్‌ రూల్స్‌ పాటిస్తా'అంటూ వివరించింది.

ఇది కూడా చదవండి :నాగ్‌పూర్‌లో ఘోర ప్రమాదం.. సోలార్ బూస్టర్ ప్లాంట్ పేలి 9మంది మృతి

అలాగే ఆరోగ్యంగా ఉండటానికి కష్టమైన వర్కౌట్స్ చేయాల్సిన పనిలేదన్న నటి.. రొటీన్‌ వర్కవుట్లు చాలని చెప్పింది. శారీరకంగా, మానసికంగా హెల్తీగా ఉండాలంటే ఒత్తిడి దరి చేరనివ్వకూడదు. ఎందుకంటే ఒక్కరోజులో ఏదో సాధిస్తామనుకుంటే అది పెద్ద తప్పు. కమిట్ మెంట్ తో పనిచేస్తే సక్సెస్ అదే వస్తుంది. ఓపిక చాలా అవసరం. ఇబ్బందులు ఎదురైనప్పుడే ధైర్యంగా నిలబడాలి. గెలిచినపుడు పొంగిపోవడం, ఓడిపోతే కుంగిపోకూడదు. అలాగైనే మన గమ్యం చేరలేం. సోషల్‌ మీడియాలో వార్తలను అసలే పట్టించుకోకూడదు. పుకార్లు, గాసిప్స్ చూసి ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ముందడుగే వేయలేం. ఆడగాళ్లలాగే చాలా ఫోకస్డ్‌గా ఉండాలంటూ సరదాగా పలు విషయాలు చెప్పుకొచ్చింది దీపిక. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. షారుఖ్ ఖాన్ సరసన నటించిన 'పఠాన్' బిగ్ హిట్ అయిన విషయం తెలసిందే. కాగా ఇటీవల వచ్చి అట్లీ, షారుఖ్ 'జవాన్'లోనూ స్పెషల్ రోల్ చేసి అభిమానులను అలరించింది. ప్రస్తుతం ప్రభాస్ 'కల్కీ'లోనూ నటిస్తున్న హాటీ.. నెక్ట్స్ బాలీవుడ్ ప్రాజెక్ట్ గురించి ఇంకా ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు.

#beauty #deepika-padukone #secrets
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe