Egg Bajji : చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. ఎంతో ఆరోగ్యంగా ఉన్నవారు కూడా హఠాత్తుగా మరణించడంతో అందరూ దిగ్భ్రాంతికి గురవుతుంటారు. రెప్పపాటు క్షణాల్లో అంతా జరిగిపోతుంది. ఒక్కోసారి మనం ఎంతో ఇష్టంగా తినే పదార్ధాలు కూడా మన ప్రాణాలను తీస్తాయని తెలుస్తే షాక్ అవుతాం. తాజాగా అలాంటి ఘటనే వనపర్తి జిల్లాలో జరిగింది. ఎగ్ బజ్జీ తింటుండగా గొంతులో ఇరుక్కొని ఓ వ్యక్తి ప్రాణాలు పోయాయి.
పూర్తిగా చదవండి..Egg Bajji : వనపర్తి జిల్లాలో దారుణం.. ప్రాణం తీసిన ఎగ్ బజ్జీ..!
వనపర్తి జిల్లాలో దారుణం జరిగింది. మదనాపురం మండలంలోని గోవిందహళ్లికి చెందిన గొల్ల తిరుపతయ్య ఎగ్ బజ్జీ తింటుండగా గొంతులో ఇరుక్కుపోయింది. కిందపడిపోయిన తిరుపతయ్య గొంతులో నుంచి చుట్టుపక్కలవారు వచ్చి బజ్జీ తీశారు. అప్పటికే ఆలస్యం కావడంతో తిరుపతయ్య ఊపిరాడక ప్రాణం విడిచాడు.
Translate this News: