Egg Bajji : వనపర్తి జిల్లాలో దారుణం.. ప్రాణం తీసిన ఎగ్ బజ్జీ..!
వనపర్తి జిల్లాలో దారుణం జరిగింది. మదనాపురం మండలంలోని గోవిందహళ్లికి చెందిన గొల్ల తిరుపతయ్య ఎగ్ బజ్జీ తింటుండగా గొంతులో ఇరుక్కుపోయింది. కిందపడిపోయిన తిరుపతయ్య గొంతులో నుంచి చుట్టుపక్కలవారు వచ్చి బజ్జీ తీశారు. అప్పటికే ఆలస్యం కావడంతో తిరుపతయ్య ఊపిరాడక ప్రాణం విడిచాడు.