David Warner: డేవిడ్‌ 'బాయ్'‌ లాస్ట్‌ టెస్ట్.. తన పిల్లలతో కలిసి ఫొటో.. వైరల్!

డేవిడ్‌ వార్నర్‌ తన వీడ్కోలు టెస్టులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సిడ్నీ వేదికగా పాక్‌తో ఆస్ట్రేలియా తలపడుతోంది. మ్యాచ్‌కు ముందు జాతీయ గీతం పాడడానికి వార్నర్‌ తన ముగ్గురు కుమార్తెలతో కలిసి గ్రౌండ్‌లోకి రావడంతో స్టేడియం చప్పట్లతో మారుమోగింది.

New Update
David Warner: డేవిడ్‌ 'బాయ్'‌ లాస్ట్‌ టెస్ట్.. తన పిల్లలతో కలిసి ఫొటో.. వైరల్!

డేవిడ్‌ వార్నర్‌.. భారత్‌ క్రికెట్‌ అభిమానులు ముద్దుగా డేవిడ్‌ భాయ్‌ అని పిలుచుకునే ఈ ఆస్ట్రేలియా ఆటగాడు తన చివరి టెస్టు ఆడేస్తున్నాడు. ఆస్ట్రేలియా-పాకిస్థాన్ జట్ల మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో చివరి మ్యాచ్ సిడ్నీలో ప్రారంభమైంది. ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కెరీర్‌లో చివరి రెడ్ బాల్ గేమ్ ఇది. ఈ గేమ్ తర్వాత, వార్నర్ మళ్లీ టెస్ట్ జెర్సీలో కనిపించడు. ఇక ఇటీవలే వన్డేల నుంచి కూడా వార్నర్‌ రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక అతడిని మనం క్లబ్‌ క్రికెట్‌లో చూడవచ్చు.. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు వార్నర్‌ కెప్టెన్‌గా ఉన్నాడు.


వీడ్కోలు టెస్టు కావడంతో డేవిడ్ వార్నర్‌(David Warner)పైనే అందరిచూపు పడింది. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు జాతీయ గీతం పాడడానికి వార్నర్‌ తన ముగ్గురు కుమార్తెలతో కలిసి గ్రౌండ్‌లోకి వచ్చాడు. ఈ సీన్‌ను చూసిన ప్రేక్షకులు స్టేడియం మారుమోగేలా చప్పట్లు కొట్టారు. ప్రేక్షకుల నుంచి క్రికెటర్లు, అటు వ్యాఖ్యాతల సైతం క్లాప్స్‌ కొట్టారు.


తుది దశకు 14ఏళ్ల కెరీర్:

డేవిడ్ వార్నర్ జనవరి 11, 2009న అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌లో వార్నర్‌కు చోటు లభించింది. తన తొలి గేమ్‌లో అతను 43 బంతుల్లో 89 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. అప్పటి నుంచి వార్నర్ తన 14 ఏళ్ల కెరీర్‌లో టీ20, వన్డే, టెస్ట్ క్రికెట్‌లో ఎన్నో అద్బుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు.

ఎన్నో రికార్డులు..:
గత 13 ఏళ్లలో టెస్టు ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు వార్నరే. టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియాకు డేవిడ్ వార్నర్ అద్భుత ఓపెనర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గత 13 ఏళ్లలో ఓపెనర్‌గా వార్నర్‌వే అత్యధిక సెంచరీలు. అటు డేవిడ్ వార్నర్ తన టెస్టు కెరీర్‌లో మొత్తం 111 మ్యాచ్‌లు ఆడాడు. 44.58 సగటుతో మొత్తం 8,695 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 36 అర్ధసెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో అతని అత్యధిక స్కోరు 335. వన్డేలు, టీ20ల్లో కూడా వార్నర్ ఇరగదీసింది. వార్నర్ 161 వన్డేల్లో 45.30 సగటుతో 6,932 పరుగులు.. 99 టీ20ల్లో 32.88 సగటుతో 2,894 పరుగులు చేశాడు.

Also Read: ఈ వీడియో చూస్తే విరాట్‌ ఆ రోజు ఎంత బాధపడ్డాడో అర్థమవుతుంది.. 😭!
WATCH:

Advertisment
తాజా కథనాలు