David Warner: ఆస్ట్రేలియా.. కోచ్ గా డేవిడ్ వార్నర్! ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ భవిష్యత్తులో కోచ్ గా పనిచేయాలనుకుంటున్నట్లు చెప్పారు. 'ఇది నా డ్రీమ్. నేను కోచ్ బాధ్యతలు చేపడితే క్రికెట్ మరింత డైనమిక్ గా మారుతుందని భావిస్తున్నా. కానీ మరికొంత కాలం నేను కుటుంబానికి దూరం కావడం నా భార్య ఒప్పుకుంటుందో లేదో అడగాలి' అన్నారు. By srinivas 08 Jan 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి David Warner: ఆస్ట్రేలియా (Australia) క్రికెట్ స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ తన భవిష్యత్తు ప్రణాళికపై ఓపెన్ అయ్యారు. ఇటీవలే టెస్ట్ (Test), వన్డే (ODI)ఫార్మట్ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన.. టీ20ల్లో మాత్రం మరికొంతకాలం కొనసాగుతాననని చెప్పారు. అయితే పాకిస్థాన్ తో టెస్ట్ సిరీస్ ముగిసిన ఆనంతరం స్వదేశానికి వెళ్లిన ఆయన.. రీసెంట్ గా ఓ ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నా డ్రీమ్ .. ఈ మేరకు తాను క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకున్న తర్వాత కోచ్‌గా (Coach) మారాలనుకుంటున్నట్లు తెలిపాడు. 'నాకు ఒక డ్రీమ్ ఉంది. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కోచ్‌గా పని చేయాలనుకుంటున్నా. ఈ విషయంపై ఫస్ట్ నా భార్యతో మాట్లాడాలి. ఇంకొంత కాలం ఇంటికి దూరంగా ఉండేందుకు అనుమతిస్తుందో లేదో చూడాలి. జట్టులోకి వచ్చిన కొత్తలో మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్ల ముఖాల్లోకి చూసేవాడిని. వారు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కలవరపెట్టడం ద్వారా లయను దెబ్బతీసేవాడిని. జట్టు నన్ను అలాగే తీర్చిదిద్దింది. ఇకపై అలాంటి స్లెడ్జింగ్ చూస్తారని అనుకోను. వచ్చే అయిదు, పదేళ్లలో అంతా మారిపోతుంది. స్లెడ్జింగ్ కంటే గెలవడంపైనే ఎక్కువ దృష్టిసారిస్తారు. ఐపీఎల్ వంటి దేశీయ లీగ్‌లలో వివిధ దేశాల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లు పంచుకుంటుండటంతో పదేళ్లలో స్లెడ్జింగ్ దూరమవుతుందని భావిస్తున్నా' అని వార్నర్ వెల్లడించారు. అలాగే తాను కోచ్ గా ఉంటే, మొత్తం డైనమిక్ మారుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. ఇది కూడా చదవండి : Contraceptive Pills: గర్భనిరోధక మాత్రలు తీసుకుంటున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి! కన్నీటి వీడ్కోలు.. ఇక 37 ఏళ్ల వార్నర్ శనివారం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో తన చివరి టెస్టు మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. 'విజయంతో నా కెరీర్ ముగిసినందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నా. కొంత మంది గొప్ప క్రికెటర్లతో కలిసి ఆస్ట్రేలియా తరఫున ఆడే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. అన్ని సందర్బాల్లోనూ నా వెన్నంటి నిలిచిన నా భార్యకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్న తక్కువే. గత రెండేళ్లుగా ఆస్ట్రేలియా టీమ్ అద్భుతంగా ఆడుతోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్, యాషెస్ సిరీస్ డ్రా, ప్రపంచకప్ విజయాల్లో భాగమైనందుకు గర్వ పడుతున్నా' అంటూ వార్నర్ భావోద్వేగానికి గురయ్యారు. పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌ను ఆస్ట్రేలియా 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. 111 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన వార్నర్ 44.5 సగటుతో 8695 పరుగులు చేశాడు. అందులో 3 డబుల్ సెంచరీలు, 26 శతకాలు, 56 అర్ధ శతకాలు ఉన్నాయి. #australia #david-warner #coach మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి