Viral: రాజమౌళి డైరెక్షన్‌లో డేవిడ్ వార్నర్ హీరోగా వైరలవుతున్న వీడియో!

దిగ్గజ సినిమా దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli), ఆస్ట్రేలియన్‌ స్టార్ క్రికెటర్‌ డేవిడ్ వార్నర్ (David Warner) కలిసి నటించారు. ఇది ఏ సినిమాలో అనుకుంటే మీ పొరపాటే. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అయింది.

New Update
Viral: రాజమౌళి డైరెక్షన్‌లో డేవిడ్ వార్నర్ హీరోగా వైరలవుతున్న వీడియో!

పాపులర్ సెలబ్రిటీలు, స్పోర్ట్స్ స్టార్స్‌తో వివిధ కంపెనీలు ఎండార్స్‌మెంట్స్‌ కోసం ఒప్పందాలు చేసుకుంటాయి. కొన్నిసార్లు యాడ్స్ కోసం సినిమా వాళ్లు క్రీడాకారులు కలిసి పని చేస్తుంటారు. ఎక్కువ మందికి ప్రొడక్ట్స్ రీచ్ అవ్వడమే లక్ష్యంగా యాడ్ వీడియోలు రూపొందిస్తారు. తాజాగా ఒక అడ్వర్టైజ్‌మెంట్ కోసం దిగ్గజ సినిమా దర్శకుడు రాజమౌళి (SS Rajamouli), ఆస్ట్రేలియన్‌ స్టార్ క్రికెటర్‌ డేవిడ్ వార్నర్ (David Warner) కలిసి నటించారు. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అయింది.

రాజమౌళి, డేవిడ్ వార్నర్ ఇద్దరూ కలిసి ఒక క్రెడిట్ కార్డ్ యాడ్‌లో నటించారు. సన్‌రైజర్స్‌కు ఆడిన వార్నర్‌కు తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. అల్లు అర్జున్ నటనకు పెద్ద ఫ్యాన్ అని అతడు చాలా సందర్భాల్లో చెప్పాడు. తెలుగు సినిమా పాటలకు డ్యాన్స్ చేస్తూ, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. ఇప్పుడు ‘బాహుబలి’, ‘RRR’ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్‌లో నటించే అవకాశాన్ని వార్నర్ అందుకున్నట్లు యాడ్‌లో చూపించారు.

ఇండియన్ ఫిన్‌టెక్ కంపెనీ క్రెడ్ (CRED) కోసం ఈ యాడ్ ఫిలిం చేశారు. ఈ యాడ్‌లో రాజమౌళి ఒక క్రికెట్ మ్యాచ్ టిక్కెట్లను తక్కువ ధరకు ఎలా పొందాలో డేవిడ్ వార్నర్‌ను అడుగుతాడు. దీనికి వార్నర్, క్రెడిట్ UPI (CRED UPI) వాడితే క్యాష్‌బ్యాక్ పొందవచ్చని చెబుతాడు. వేరే మార్గం లేదా అని రాజమౌళి అడిగినప్పుడు, వార్నర్ ఒక ఫేవర్ చేయాలని కోరతాడు. రాజమౌళి సినిమాలో హీరోగా నటించే అవకాశం ఇవ్వాలని వార్నర్ రిక్వెస్ట్ చేస్తాడు. అందుకు రాజమౌళి ఒప్పుకుంటాడు.రాజమౌళి సినిమా కోసం షూటింగ్ ప్రారంభిస్తాడు, ఇందులో నటించడం స్టార్ట్ చేసిన వార్నర్ భారతీయ సంస్కృతి, చరిత్రను అర్థం చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ, వార్నర్ యాక్టింగ్ స్కిల్స్, ప్రశ్నలకు రాజమౌళి చిరాకు పడతాడు. ఒక సీన్‌లో వార్నర్ రాజమౌళితో “ఆస్కార్లలో కలుద్దాం” అని కాన్ఫిడెంట్‌గా అంటాడు. దీనికి రాజమౌళి కళ్లు గుండ్రంగా తిప్పుతూ ‘నీ నటనకు ఆస్కార్ అవార్డు ఇస్తారా?’ అన్నట్లు ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తాడు.మరొక సీన్‌లో వార్నర్ రాజమౌళిని “హేయ్ రాజా, RRR సినిమా పేరు RRR అంటావా లేదా Rrrr అంటావా?” అని అడుగుతాడు. తరువాత, సినిమా ఫైట్‌లో గుర్రాలకు బదులుగా కంగారులను ఉపయోగించాలని కూడా రాజమౌళికి సలహా ఇస్తాడు.

ఇలా విసిగించే వార్నర్‌తో సినిమా తీయడం కంటే క్రెడిట్ UPIని ఎంచుకోవడం మంచిదని రాజమౌళి చివరికి నిర్ణయించుకుంటాడు. చివరిగా రాజమౌళి క్రెడ్ యూపీఐ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని ఫోన్ ద్వారా చూపిస్తాడు. అంతటితో ఈ ప్రకటన ముగుస్తుంది. చాలా ఫన్నీగా ఉండటంతో పాటు క్రెడిట్ కార్డు బెనిఫిట్స్‌ను తెలియజేసిన ఈ యాడ్ చాలామందిని ఆకట్టుకుంది.ప్రస్తుతం డేవిడ్ వార్నర్ ఐపీఎల్ 2024లో హైదరాబాద్ జట్టు తరఫున ఆడుతున్నాడు. సోషల్ మీడియాలో వీడియోల ద్వారా భారతీయ సినిమాలపై తన ప్రేమను వ్యక్తం చేయడం వార్నర్‌కు అలవాటుగా మారింది. ముఖ్యంగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అతని బ్లాక్ బస్టర్ మూవీ ‘పుష్ప’ అంటే ఈ క్రికెటర్‌కు చాలా ఇష్టం. ఈ ప్లేయర్ ‘పుష్ప’లోని హుక్ స్టెప్‌ను, బన్నీ తగ్గేదేలే పోజులను క్రికెట్ మైదానంలో ఇమిటేట్ చేస్తూ ఆకట్టుకున్నాడు.

Advertisment
తాజా కథనాలు