David Warner : వార్నర్ ఫ్యాన్స్ కు షాక్.. న్యూ ఇయర్ రోజే డేవిడ్ సంచలన నిర్ణయం

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన ఆయన.. తాజాగా వన్డేల నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపాడు. 2025లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తన సేవలు అవసరమైతే మళ్లీ ఆడతానన్నాడు.

David Warner : వార్నర్ ఫ్యాన్స్ కు షాక్.. న్యూ ఇయర్ రోజే డేవిడ్ సంచలన నిర్ణయం
New Update

David Warner Shocking Decision : ఆస్ట్రేలియా(Australia) క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌(David Warner) న్యూ ఇయర్ రోజే తన ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చాడు. ఇప్పటికే టెస్ట్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌(Retirement) ప్రకటించిన ఆయన ప్రస్తుతం పాకిస్థాన్ తో తన చివరి టెస్ట్ సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. కాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ మేరకు వన్డే  ఫార్మట్(ODI Format) నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్లు అనౌన్స్ చేశాడు.

ఈ మేరకు సోమవారం మీడియాతో మాట్లాడి డేవిడ్ వార్నర్.. భారత్‌(India) పై వన్డే ప్రపంచకప్‌ (World Cup) గెలిచిన తర్వాతే రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్నానని, తాను ఆటకు ముగింపు పలకడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నట్లు తెలిపాడు. 'నా నిర్ణయం వల్ల కొత్త వారికి అవకాశాలు లభిస్తాయని ఆశిస్తున్నా. ఒకవేళ 2025లో జరిగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు ఓపెనర్ గా నా సేవలు అవసరమైతే మళ్లీ పునరాగమనం చేస్తా. ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్‌ లీగ్‌లో కొనసాగుతాను. ఇక టెస్టు, వన్డే క్రికెట్‌ నుంచి తప్పుకోవడం వల్ల ఫ్రాంఛైజీ లీగ్‌లలో పాల్గొనేందుకు మరింత ఎక్కువ సమయం లభిస్తుంది. నా క్రికెట్‌ కెరీర్‌ను తీర్చిదిద్దడంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ గ్రెగ్‌ చాపెల్‌ (Greg Chappell) కీలక పాత్ర పోషించారు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు' అంటూ తనదైన స్టైల్ లో చెప్పుకొచ్చాడు. అలాగే తన సహచర ఆటగాళ్లు, వీదేశీ ఆటగాళ్లతోపాటు భారత్ లో తనకు లభించిన మద్ధతు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, ఇండియన్ ఫ్యాన్స్ కు ప్రత్యేక కృజ్ఞతలు తెలిపాడు వార్నర్.

ఇది కూడా చదవండి : Revanth Reddy New Year: రైతులు, విద్యార్థులకు రేవంత్‌ గుడ్‌న్యూస్‌.. న్యూఇయర్‌ మెసేజ్‌లో ఏం అన్నారంటే?

ఇక 2023 వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించడంలో వార్నర్‌ కీలక పాత్ర పోషించాడు. రెండు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలతో కలిసి మొత్తం 528 పరుగులు చేసిన వార్నర్ ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా ఆటగాడిగా నిలిచాడు. ఇక మొత్తం తన కెరీల్ లో 161 వన్డే మ్యాచ్‌లు ఆడగా 97.26 స్ట్రైక్‌ రేట్‌ తో మొత్తం 6,932 పరుగులు చేశాడు. సగటు- 45.3. అత్యధిక స్కోర్‌- 179 ఉండగా ఇదులో 33 అర్ధశతకాలున్నాయి.

#david-warner #australia #retirement #odis
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe