T20 World Cup : క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టిన ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్!

టీ20 ప్రపంచకప్‌ 2024లో భాగంగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో అదరగొట్టిన డేవిడ్ వార్నర్.. టీ20ల్లో అత్యధిక 50+ ప్లస్‌ స్కోర్ల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేసాడు.

T20 World Cup : క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టిన ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్!
New Update

David Warner Breaks Chris Gayle Record : ఆస్ట్రేలియా వెటరన్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ తాజాగా ఓ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. టీ20 ప్రపంచకప్‌ 2024లో భాగంగా ఒమన్‌తో గురువారం (జూన్‌ 6) జరిగిన మ్యాచ్‌లో హాఫ్‌ సెంచరీతో (51 బంతుల్లో 56; 6 ఫోర్లు, సిక్సర్‌) అదరగొట్టిన వార్నర్.. టీ20ల్లో అత్యధిక 50+ ప్లస్‌ స్కోర్ల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేసాడు.

Also Read : ఫస్ట్ మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ.. ఆ రికార్డ్ అందుకున్న మూడో క్రికెటర్ గా హిట్ మ్యాన్!

ఒమన్‌పై హాఫ్‌ సెంచరీ కలుపుకుని వార్నర్‌ ఖాతాలో 111 ఫిఫ్టి ప్లస్‌ స్కోర్లు ఉండగా.. క్రిస్ గేల్‌ పేరిట 110 50+ ప్లస్‌ స్కోర్లు నమోదై ఉన్నాయి. అయితే వార్నర్‌ కేవలం 378 ఇన్నింగ్స్‌ల్లో 111 50+ ప్లస్‌ స్కోర్ల మార్కు అందుకోగా.. గేల్‌కు 110 50+ప్లస్‌ స్కోర్లు చేసేందుకు 455 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఇక రానున్న రోజుల్లో జరిగే T 20 మ్యాచుల్లో డేవిడ్ వార్నర్ ఇంకెలాంటి రికార్దులు సృష్టిస్తాడో చూడాలి.

#t20-world-cup #david-warner #chris-gayle
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe