T20 World Cup : ఫస్ట్ మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ.. ఆ రికార్డ్ అందుకున్న మూడో క్రికెటర్ గా హిట్ మ్యాన్!

టీ20 వరల్డ్‌కప్‌ లో ఐర్లాండ్‌పై 52 ప‌రుగుల వ‌ద్ద హిట్‌మ్యాన్ రిటైర్డ్ హ‌ర్ట్‌గా వెనుదిరిగినా.. ఈ మ్యాచ్‌తో అరుదైన ఘ‌న‌త సాధించాడు. పొట్టి ఫార్మాట్‌లో 4,000 ర‌న్స్ కొట్టిన మూడో బ్యాట‌ర్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు.

New Update
T20 World Cup : ఫస్ట్ మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ.. ఆ రికార్డ్ అందుకున్న మూడో క్రికెటర్ గా హిట్ మ్యాన్!

Rohit Sharma Rare Feet : టీ20 వరల్డ్‌కప్‌ లో టీమ్‌ ఇండియా శుభారంభం చేసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా బుధవారం న్యూయార్క్ వేదికగా జరిగిన పోరులో ఐర్లాండ్ పై 8 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది.కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఐర్లాండ్‌పై 52 ప‌రుగుల వ‌ద్ద హిట్‌మ్యాన్ రిటైర్డ్ హ‌ర్ట్‌గా వెనుదిరిగినా.. ఈ మ్యాచ్‌తో అరుదైన ఘ‌న‌త సాధించాడు.

మూడో బ్యాట్స్ మెన్ గా.. 

పొట్టి ఫార్మాట్‌లో 4,000 ర‌న్స్ కొట్టిన మూడో బ్యాట‌ర్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఇప్పటికే ఘనతను విరాట్ కోహ్లీ, పాకిస్థాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజాం సాధించగా.. ఇక ఇప్పుడు వాళ్ళ సరసన రోహిత్ శర్మ సైతం చేరాడు. దీంతో T 20 ఫార్మాట్‌లో 4,000 రన్స్ క్రాస్ చేసిన మూడో బ్యాట్స్ మెన్ గా రోహిత్ శర్మ నిలిచాడు. ప్ర‌స్తుతం విరాట్ 4,038 ర‌న్స్‌తో అగ్ర‌స్థానంలో ఉండ‌గా.. బాబ‌ర్ 4,023 ప‌రుగులతో రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు