T20 World Cup : క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టిన ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్! టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన డేవిడ్ వార్నర్.. టీ20ల్లో అత్యధిక 50+ ప్లస్ స్కోర్ల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేసాడు. By Anil Kumar 06 Jun 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి David Warner Breaks Chris Gayle Record : ఆస్ట్రేలియా వెటరన్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ తాజాగా ఓ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా ఒమన్‌తో గురువారం (జూన్ 6) జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో (51 బంతుల్లో 56; 6 ఫోర్లు, సిక్సర్) అదరగొట్టిన వార్నర్.. టీ20ల్లో అత్యధిక 50+ ప్లస్ స్కోర్ల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ రికార్డును బ్రేక్ చేసాడు. Also Read : ఫస్ట్ మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ.. ఆ రికార్డ్ అందుకున్న మూడో క్రికెటర్ గా హిట్ మ్యాన్! ఒమన్‌పై హాఫ్ సెంచరీ కలుపుకుని వార్నర్ ఖాతాలో 111 ఫిఫ్టి ప్లస్ స్కోర్లు ఉండగా.. క్రిస్ గేల్ పేరిట 110 50+ ప్లస్ స్కోర్లు నమోదై ఉన్నాయి. అయితే వార్నర్ కేవలం 378 ఇన్నింగ్స్‌ల్లో 111 50+ ప్లస్ స్కోర్ల మార్కు అందుకోగా.. గేల్‌కు 110 50+ప్లస్ స్కోర్లు చేసేందుకు 455 ఇన్నింగ్స్‌లు అవసరమయ్యాయి. ఇక రానున్న రోజుల్లో జరిగే T 20 మ్యాచుల్లో డేవిడ్ వార్నర్ ఇంకెలాంటి రికార్దులు సృష్టిస్తాడో చూడాలి. #david-warner #t20-world-cup #chris-gayle మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి