విపక్ష కూటమి మూడవ సమావేశానికి తేదీలు ఖరారు....!

విపక్ష కూటమి మూడవ సమావేశానికి తేదీలు ఖరారు....!
New Update

విపక్ష ‘ఇండియా’కూటమి మూడవ సమావేశాన్ని ముంబైలో నిర్వహించనున్నారు. అగస్టు 31, సెప్టెంబర్ 1 రోజుల్లో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు కాంగ్రెస్ శ్రేణులు వెల్లడించాయి. మోడీ ఇంటి పేరుపై పరువు నష్టం కేసులో సుప్రీం కోర్టులో రాహుల్ గాంధీకి ఊరట లభించిన సమయంలో ఈ సమావేశం జరుగనుండం గొప్ప ప్రాధాన్యత సంతరించుకుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.

ముంబైలోని గ్రాండ్ హయత్ లో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నట్టు శివసేన(యూబీటీ) నేత, ఎంపీ సంజయ్ రౌత్ వెల్లడించారు. ఈ సమావేశానికి కనీసం ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారని తాము భావిస్తున్నట్టు చెప్పారు. అగస్టు 31న ఈ సమావేశం ప్రారంభం అవుతుందన్నారు. మొదటి రోజు సాయంత్రం విపక్ష నేతలకు మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే విందు ఇస్తారని తెలిపారు.

కాంగ్రెస్ మహారాష్ట్ర చీఫ్ నానో పటోలే మాట్లాడుతూ..... ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్టు వివరించారు. విపక్ష పార్టీల మొదటి సమావేశం జూన్ 23న జరిగింది. ఈ సమావేశానికి ప్రతిపక్షాలకు చెందిన 16 పార్టీలు హాజరయ్యాయి. ఆ తర్వాత రెండవ సమావేశం జూలై 17,18 తేదీల్లో బెంగళూరులో జరిగింది. ఈ సమావేశానికి 26 పార్టీలు హాజరయ్యాయి.

రెండో సమావేశంలోనే విపక్ష కూటమికి ఇండియా(ఇండియన్ నేషనల్ డెవలప్ మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్) అనే పేరు పెట్టారు. ఇది ఇలా వుంటే 11 మంది సభ్యులతో కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈ కూటమికి కన్వీనర్ ను తదుపరి సమావేశంలో ఎన్నుకోనున్నట్టు వివరించారు.

#rahul-gandhi #india #sanjay-raut #opposition-parties #udhav-thakre #third-meeting
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe