Dasoju Sravan: కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు.. కాంగ్రెస్ శ్వేతపత్రంపై దాసోజు కౌంటర్!

సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, విద్యుత్ రంగంపై అసెంబ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై ఆయన కౌంటర్ ఇచ్చారు.

New Update
Dasoju Sravan: కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు.. కాంగ్రెస్ శ్వేతపత్రంపై దాసోజు కౌంటర్!

Dasoju Shravan Letter To CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కి బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్(Dasoju Shravan) బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలపై ఆయన తన బహిరంగ లేఖలో ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయన లేఖలో.. 'గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బహిరంగ లేఖ అంటూ ప్రస్తావిస్తూ.. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు మీ ప్రభుత్వం శ్వేత పత్రాలు విడుదల చేసేందుకు కోట్ల రూపాయల ఖర్చుతో అసెంబ్లీ సమావేశాలు ఎందుకు? కేవలం పత్రికా సమావేశాలు నిర్వహించి సదరు పత్రాలు విడుదల చేస్తే ప్రజలకు తెలియదా? ప్రతిపక్షాలు వాటికి సమాధానం ఇవ్వరా? తప్పు జరిగితే విచారణలకు ఆదేశించడానికి అసెంబ్లీ సమావేశాలు వేదిక కావాల్నా ఆలోచించండి.

ALSO READ: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. వీరికే కొత్త రేషన్ కార్డులు!

ఇదంతా ఒక సినిమా ఫక్కీలో అతి ఆర్భాటంగా తప్పుడు లెక్కలతో శ్వేత పత్రాలు విడుదల చేయడం వెనుక కేవలం కెసిఆర్ గారి గత ప్రభుత్వాన్ని బదనాం చెయ్యాలన్నటువంటి యొక్క దుగ్ద తప్ప తెలంగాణ భవిష్యత్తు నిర్మాణానికి, ప్రజల అభివృద్ధికి పునాదులు వెయ్యాలని సంకల్పం మాత్రం ఉన్నట్లుగా లేదు

మీ నేతృత్వంలో కాంగ్రెస్(Congress) పార్టీ 39% ఓట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. అదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ 37% ఓట్లతో ప్రతిపక్షంలో కూర్చుంది. ఎన్నికల సందర్భంలో ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు మరియు శ్రీమతి సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారు, డీకే శివకుమార్ గారు మరియు మీతో సహా అనేక మంది అనేక వాగ్దానాలు చేశారు. యూత్ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, ఎస్ సి, ఎస్ టి డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్ దానితో పాటు ఆరు గ్యారెంటీలు, మరియు విస్తృతమైన మేనిఫెస్టో, మార్పు అనే నినాదాలతో అందమైన కలను చూపిస్తూ మీరంతా ప్రచారం చేస్తే, మీ వాగ్దానాలను నమ్మి మీ పథకాలను చూసి, నచ్చి మెచ్చిన ప్రజలు మీకు అధికారం కట్టబెట్టారు.

ALSO READ: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సజ్జనార్ కీలక ప్రకటన

బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన మొదటి రోజే బిఆర్ఎస్ పార్టీ ప్రజలకు విన్నవించిన విషయం ఏంటంటే నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేసేందుకు మా వంతు సహాయ సహాకారాలను అందిస్తామని. తెలంగాణ అభివృద్ధి ప్రస్థానాన్ని మాత్రం ఇంకా ద్విగుణీకృతం చేసే విధంగా ఉండాలని ఒక ప్రతిపక్ష పార్టీగా కోరుకున్నారు.' అంటూ రాసుకొచ్చారు.

పూర్తి లేఖను కింద చదవండి.. 


Advertisment
తాజా కథనాలు