ప్రగతి భవన్ లో ఘనంగా దసరా వేడుకలు

దసరా పండుగను పురస్కరించుకుని తొలుత ప్రగతి భవన్ లోని నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబ సమేతంగా వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

author-image
By Bhavana
ప్రగతి భవన్ లో ఘనంగా దసరా వేడుకలు
New Update

- కుటుంబంతో కలిసి నల్ల పోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి
- శమీ పూజ, వాహన పూజ, ఆయుధ పూజ,ఆశీర్వచనం కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం

విజయ దశమి వేడుకలు సోమవారం ప్రగతి భవన్ లో ఘనంగా జరిగాయి. దసరా పండుగను పురస్కరించుకుని తొలుత ప్రగతి భవన్ లోని నల్ల పోచమ్మ అమ్మవారి దేవాలయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబ సమేతంగా వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ సతీమణి శోభమ్మ, కుమారుడు మంత్రి కేటీఆర్, కోడలు శైలిమ, మనుమడు హిమాన్షు పాల్గొన్నారు. అనంతరం శమీపూజ నిర్వహించారు. ఇందులో భాగంగా సాంప్రదాయ పద్దతిలో జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన పూజారులు, విజయాలు సిద్ధించాలని ఆశీర్వచనం ఇచ్చారు.

శుభసూచకంగా భావించే పాలపిట్టను సీఎం దర్శనం చేసుకున్నారు. సాంప్రదాయం ప్రకారం దసరానాడు ప్రత్యేకంగా నిర్వహించే వాహన పూజలో మనుమడు హిమాన్షుతో కలిసి కేసీఆర్‌ పాల్గొన్నారు. అనంతరం సాంప్రదాయ పద్దతిలో వేదపండితులు నిర్వహించిన ఆయుధ పూజలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం ప్రగతి భవన్ అధికారులు, సిబ్బంది కేసీఆర్ నుండి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా అందరకీ కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా దీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు .అనంతరం....కర్నాటక లోని శృంగేరీ పీఠం నుంచి తీసుకుని వచ్చిన శారదాదేవి నవరాత్రోత్సవ ప్రసాదాన్ని ముఖ్యమంత్రి దంపతులకు పూజారులు అందజేశారు. కాశ్మీర్ లోని శారద స్వరజ్జపీఠం దేవాలయ జ్జాపికను తెలంగాణ మాసపత్రిక ఎడిటర్ అష్టకాల రామ్మోహన్ రావు కేసీఆర్‌ అందించారు.

#kcr #celebrations #pragathi-bhavan #dassuhra
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe