VIP's : భక్తులతో తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయం కిక్కిరిసిపోయింది. స్వామివారిని ఉత్తర ద్వార ద్వారా దర్శించుకునేందుకు భక్తులు, వీఐపీ(VIP) లు పెద్దెత్తున తరలివచ్చారు. టికెట్లు లేకుండా సర్వదర్శనానికి వచ్చిన భక్తులను అధికారులు క్యూలైన్లలోకి అనుమతించడం లేదు. ఇప్పటికే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 2 నారాయణగిరి షెడ్లు భక్తులతో నిండిపోయాయి. రెండు కిలోమీటర్ల మేర క్యూలైన్లు చేరుకున్నాయి. దీంతో వైకుంఠ ద్వారా దర్శనానికి ఇబ్బంది కలుగుతుందని భావించి టోకెన్ లేని వారిని దర్శనానికి అధికారులు నిరాకరించారు. ప్రస్తుతం క్యూలైన్లో ఉన్నవారికి ఈ అర్థరాత్రి దర్శనం అయ్యే అవకాశం ఉంది.
ఇక దేశవ్యాప్తంగా ప్రముఖులు తిరుమలకు తరలివస్తున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో సుప్రీంకోర్టు మాజీ సీజేఐ ఎన్వీరణమ దర్శనం చేసుకున్నారు. ఏపీ మంత్రులు అంబటి రాంబాబు, రోజా , అమర్నాథ్, ఉషశ్రీ చరణ్, ఎంపీ రఘురామ కృష్ణమ రాజు, టీడీపీ నేతలు అచ్చన్ననం నాయుడు, రామ్మోహన్ నాయుడు, తెలంగాణ నుంచి గంగుల కమలాకర్, మల్లారెడ్డి దర్శించుకున్నారు. సినీ ప్రముఖులు నిర్మాత బండ్ల గణేష్, రాజేంద్రప్రసాద్ ఉత్తర ద్వార ద్వారా దర్శనం చేసుకున్నారు.
వేకువ జామున 1.30 గంటల నుంచి ఆలయ అర్చకులు వాస్త్రోక్తంగా శ్రీవారి ఆలయానికి పక్కన ఉన్న వైకుంఠ ద్వారాన్ని తెరిచి శ్రీనివాసుడికి నిత్య కైంకర్యాలు, తిరుప్పావై పఠనం చేశారు. అనంతరం భక్తులను వైకుంఠ ద్వారం గుండా శ్రీవేంటేశ్వర స్వామి దర్శనానికి అనుమతించారు.
ఇది కూడా చదవండి: నేడు ముక్కోటి ఏకాదశి..ఇవాళ ఉత్తర ద్వార దర్శనం చేసుకునేది ఇందుకేనట..!!