/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-3-3-jpg.webp)
Priyadarshi: యువ నటుడు ప్రియదర్శి, నటి నభా నటేష్ (Nabha natesh)మధ్య కొనసాగుతున్న 'డార్లింగ్' వివాదంలోకి ఇప్పుడు రీతూ వర్మ కూడా ఎంటర్ అయింది. నభాను ప్రియదర్శి డార్లింగ్ అని పిలవడంతో తనకు నచ్చలేదంటూ ఆమె అసహనం వ్యక్తం చేయగా ఇందుకు సంబంధించిన పోస్టులు వైరల్ అయ్యాయి. పరిచయం లేని మహిళను డార్లింగ్ అని పిలవడం నేరమని, కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త అంటూ నభా నటేశ్ ఫైర్ అయింది.
— Ritu Varma (@riturv) March 22, 2024
నీ అందానికి ముగ్ధుడనయ్యా..
అయితే వీరిద్దరి గొడవలోకి నటి రీతూవర్మ (Ritu Varma)ను కూడా లాగారు ప్రియదర్శి. పూర్తి వివరాల్లోకి వెళితే.. నటి రీతూవర్మ ఇటీవల ఓ ఫొటోషూట్‌లో పాల్గొంది. ఇందుకు సంబంధించిన పిక్స్ ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీంతో ‘వావ్ రీతూ డార్లింగ్.. ఎంత అందంగా ఉన్నావో. నీ అందానికి ముగ్ధుడనయ్యా. మాటలు రావడం లేదు’ అంటూ ప్రయదర్శి కామెంట్ చేశాడు. అయితే ఈ పోస్ట్ పై మరోసారి రియాక్ట్ అయిన నభా.. ‘ఇతను మళ్లీ మొదలుపెట్టాడు. ఆడవాళ్ల కామెంట్ సెక్షన్‌పై ఉన్నట్టుండి ఆసక్తి చూపిస్తున్నాడు. అందరినీ డార్లింగ్ అని పిలవడం ఏంటి? నీ బ్రెయిన్ పనిచేయడం లేదా?’ అంటూ తనదైన స్టైల్ లో సెటైర్స్ వేసింది.
Mr. choose your words carefully before commenting!! https://t.co/zE2Ql91st3 pic.twitter.com/N0xaZ3j6WD
— Nabha Natesh (@NabhaNatesh) April 17, 2024
ఇది కూడా చదవండి: SSMB 29 : జక్కన్న- ప్రిన్స్ మూవీ టైటిల్ ఫిక్స్.. మహేష్ నయా లుక్ వైరల్!
నా కామెంట్ సెక్షన్‌లో మీ పంచాయితీ ఏంటి..
ఈ క్రమంలోనే మరోసారి రియాక్ట్ అయిన ప్రియదర్శి.. ‘నేను ఎవరినైనా డార్లింగ్ అని పిలిస్తే నీకెందుకు ఇబ్బంది?’ అంటూ ప్రశ్నించాడు. అయితే ఈ కన్వర్జేషన్ పై రీతూవర్మ స్పందిస్తూ.. ‘నా కామెంట్ సెక్షన్‌లో మీ పంచాయితీ ఏంటి?’ అని ఇద్దరినీ అడిగారు. ఈ పోస్టులు ప్రస్తుతం వైరల్ అవుతుండగా.. నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా ప్రమోషన్స్ లో భాగమే, వీరిమధ్య ఎలాంటి విభేదాలు లేవని తేల్చి చెబుతున్నారు.