Deep Sleep : గాఢ నిద్రలో ఉన్నవారిని ఒక్కసారిగా లేపితే బ్రెయిన్‌కి ప్రమాదమా?

ఒక వ్యక్తి నిద్ర నుంచి అకస్మాత్తుగా మేల్కొంటే అది మెదడుకు శాశ్వత నష్టం చేయడంతోపాటు మానసిక సమతుల్యతను ప్రభావితం, జ్ఞాపకశక్తి, అభ్యాస సామర్థ్యంపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతుందని నిపుణులు అంటున్నారు. నిద్ర నుంచి లేపే ముందు ఆలోచించాలంటున్నారు.

New Update
Deep Sleep : గాఢ నిద్రలో ఉన్నవారిని ఒక్కసారిగా లేపితే బ్రెయిన్‌కి ప్రమాదమా?

Dangerous To Wake Up Sudden Deep Sleep : నిద్ర అనేది ప్రతి వ్యక్తి జీవితంలో అంతర్భాగం. నిద్ర మనకు రోజు అలసట నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అంతే కాకుండా మరుసటి రోజు శక్తిని నింపడానికి సహాయపడుతుంది. కానీ అకస్మాత్తుగా ఎవరినైనా నిద్ర నుండి లేపితే అది ప్రాణాంతకం కావచ్చని వైద్యులు అంటున్నారు. ఒక వ్యక్తి నిద్ర నుండి అకస్మాత్తుగా మేల్కొంటే అతని మెదడుకు శాశ్వత నష్టం కలిగిస్తుంది. అంతేకాకుండా వారి మానసిక సమతుల్యతను ప్రభావితం చేయడమే కాకుండా జ్ఞాపకశక్తి(Memory), అభ్యాస సామర్థ్యంపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతుంది. కాబట్టి నిద్ర ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. ఎవరినైనా నిద్ర నుంచి లేపే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. నిద్ర లేపే ఏం అవుతుందో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

మెదడు దెబ్బతింటుందా?

  • గాఢ నిద్ర(Deep Sleep) లో మన మెదడు చాలా చురుకుగా ఉంటుంది. నిద్రలో మెదడు శరీర కణాలను సరిచేయడం, కొత్త జ్ఞాపకాలను నిల్వ చేయడం లాంటి ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. మనం అకస్మాత్తుగా నిద్రలేచినట్లయితే మెదడు(Brain) పై ఒత్తిడి పడుతుంది. ఎందుకంటే అది అకస్మాత్తుగా పనిచేయడం మానేస్తుంది. ఈ ఒత్తిడి వల్ల మెదడులోని రక్తనాళాల్లో పగుళ్లు ఏర్పడి రక్తస్రావం అవుతుంది. దీన్ని బ్రెయిన్ హెమరేజ్ అంటారు. ఒక వ్యక్తి వికలాంగుడు కావచ్చు లేదా మెదడులో రక్తస్రావం కారణంగా మరణించవచ్చు. కాబట్టి గాఢనిద్రలో ఉన్నవారిని హఠాత్తుగా లేపకండి. మెల్లగా కదిలించి లేదా చిన్నగా పిలిచి లేపాలని నిపుణులు అంటున్నారు.

నిద్రలేపడానికి సరైన మార్గం

  • గాఢ నిద్రలో ఉన్న వ్యక్తి పేరును సున్నితంగా పిలవాలి. అకస్మాత్తుగా పెద్ద శబ్దాలు చేయవద్దు. వీలైతే గదిలో డిమ్ లైటింగ్(Dim Light) ఉపయోగించండి. ఆకస్మిక ప్రకాశవంతమైన కాంతి వారి నిద్రకు భంగం కలిగించవచ్చు. భుజం లేదా చేతిపై తేలికగా తాకడం ద్వారా నిద్రిస్తున్న వ్యక్తిని మేల్కొలపడానికి ప్రయత్నించండి. ఆకస్మిక లేదా బలవంతంగా తాకడం మానుకోండి. కాస్త ఓపికగా వారు నిద్రలేచే వరకు వేచి ఉండాలని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి : పొగాకు మాత్రమే కాదు మన అలవాట్లు కూడా క్యాన్సర్‌కు కారణమా?

గమనిక : ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు