Soybeans : సోయాబీన్స్‌తో అద్భుతమైన శక్తి.. వీటిని ఆహారంలో చేర్చుకుంటే రోగాలు పరార్ గుడ్లు, కోడి మాంసం కంటే సోయాబీన్స్ గింజలు శక్తిమంతమైనవి. వీటిని100 గ్రాములు ఆహారంలో తీసుకుంటే అనేక పోషకాలను పొందుతారు. వీటిని తినటం వల్ల ఎముకలకు బలం, చెడు కొలెస్ట్రాల్ తక్కువ, రక్త ప్రసరణ, జీర్ణక్రియ, గుండెకు మంచి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 18 Aug 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Soybeans Health Benefits : ప్రస్తుత కాలంలో ఆరోగ్యంగా (Healthy) ఉండాలంటే విటమిన్లు, పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం ముఖ్యం. శరీరంలో ఏదైనా లోపం ఉంటే అది తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. దానివల్ల ఖరీదైన మందులు వాడతారు. దీంతో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ (Side Effects) కూడా వస్తాయి. కొన్ని మందులు శరీరానికి హాని కలిగిస్తాయి. కొన్ని ఆరోగ్యకరమైన వాటిని ఆరోగ్యానికి తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. అలాంటి వాటిలో సోయాబీన్స్ ఒకటి. సోయాబిన్స్‌లో చాలా రకాల పోషకాలు, విటమిన్లు, ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఈ గింజల్ని తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వీటి ప్రయోజల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం సోయాబీన్స్ తింటే కలిగే ప్రయోజనాలు: మంచి జీర్ణక్రియ: సోయాబీన్స్ (Soybeans) లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఒకకప్పు సోయాబీన్స్ తీసుకుంటే ఫైబర్ పుష్కలంగా అందుతుంది. దీనివల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఎముకలకు బలం: సోయాబీన్స్ శాఖాహారులకు గొప్ప ఎంపిక. వీటిలో ఉండే అద్భుతమైన ప్రోటీన్స్ కండరాలకు, ఎముకలు ఎంతో మేలు చేస్తాయి చెడు కొలెస్ట్రాల్: సోయాబీన్స్‌ని ప్రతిరోజు తీసుకుంటే శరీరంలో పెరిగే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. సోయాబీన్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ శాతం తగ్గించే సామర్థ్యం ఉంది. రక్త ప్రసరణ: రక్త ప్రసరణ మెరుగుపరచడంలో సోయాబీన్స్ గొప్ప ఎంపిక. సోయాబీన్స్‌లో ఇనుము పుష్కలంగా ఉంది. కప్పు సోయాబీన్స్‌లో 9 మిలియన్ల గ్రాముల ఐరన్ ఉంటుంది. ఇది రక్తం, శరీరానికి ఎంతో సహాయపడుతుంది. ఈ విత్తనాలో ఉంటే పోషకాలు ఆరోగ్యంగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు. గుండెకు మంచిది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే సోయాబీన్‌ని ఆహారంలో చేర్చుకోవాలి. వీటిని తింటే గుండెలో రక్త ప్రసరణను, గుండె వాపు తగ్గుతుంది. అయితే ఎమైనా గుండె సమస్యలు ఉంటే ముందు డాక్టర్ల సలహా తీసుకున్న తర్వాత తింటే మంచిది. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. Also Read : ఏపీకి రూ.15 వేల కోట్లు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు గ్రీన్ సిగ్నల్! #health-benefits #human-life-style #soybeans #soybeans-side-effects మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి