రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. రాజకీయ నాయకులందరూ తమ పార్టీ కార్యాలయాల్లో జెండాలు ఎగురవేసి కార్యకర్తలకు అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈ క్రమంలోనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించిన ఆమె కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. స్వాతంత్య్రం కోసం బలిదానం చేసిన వారికి ఆమె ముందుగా నివాళులు ఆర్పించారు. భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం భారతదేశం అని అన్నారు.
దేశంలోని అన్ని వర్గాల వారికి సమానంగా సంక్షేమ పథకాలను ఇస్తూ అభివృద్ధి పథంలో దేశానికి ముందుకు తీసుకుని వెళ్తుంది కేంద్రం అని ఆమె పేర్కొన్నారు. సౌభ్రాతృత్వ భావనతో మనందరం ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హయాంలో భారతదేశంలో అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు.మోడీ కూడా ఈ విషయం గురించి మాట్లాడారని వివరించారు.
భారతదేశంలో అన్ని వర్గాల వారికి న్యాయం జరగాలంటే..అధికారంలో మోడీ ఉండాలని ఆమె అన్నారు. అనంతరం ఆమె విజయవాడ సీ ఛానెల్ ఆధ్వర్యంలో జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..అభిమానులకు, కార్యకర్తలకు అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఒక అపార్ట్ మెంట్ లో అందరూ కలిసి ఈ వేడుకను ఇలా ఘనంగా జరుపుకోవడం అనేది నిజంగా మెచ్చుకోదగిన విషయమని ఆమె అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదేనేమో అని అన్నారు.
గడిచిపోయిన స్మృతి కాదు స్వాతంత్య్రం అంటే..రాబోయే రోజుల్లో ఇంకా అద్భుతంగా ఉండాలని పేర్కొన్నారు.