Rain Alert in AP: బంగాళఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండం తుపాన్‌గా బలపడింది. దీనికి రెమల్ (Cyclone Remal) అని నామకరణం చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ దీవులకు 300 కిలోమీటర్లు, ఖెపుపరా (బంగ్లాదేశ్)కు నైరుతి దిశలో 310 కిలోమీటర్ల దూరంలో ఇవాళ అర్దకాత్రి తీరాన్ని దాటుతుందని ఐఎండీ వెల్లడించింది. తీరం దాటే సమయంలో గంటకు 135 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది.
Also Read: తెలంగాణ కేబినేట్ విస్తరణ తేదీ ఖరారు !