మధ్యాహ్నం 2:30 గంటలకు తుఫాను తీరం దాటే అవకాశం...!

ఏపీ తీరం వెంబడి అల్లకల్లోలం సృష్టిస్తున్న మిచౌంగ్‌ తుఫాన్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బాపట్ల వద్ద తీరం దాటనున్నట్లు విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం డైరెక్టర్‌ సునంద తెలిపారు.

New Update
Vishakhapatnam Rains: విశాఖలో భారీ వర్షం.. రాకపోకలు, స్కూళ్లు బంద్‌

Cyclone Michaung Effect in AP: బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్‌ తుఫాన్‌ చాలా వేగంగా కదులుతుంది. ప్రస్తుతం ఇది బాపట్లకి నైరుతి దిశగా 50 కిలో మీటర్ల దూరంలో ఉన్నట్లు విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం డైరెక్టర్‌ సునంద తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు తుఫాను తీరం దాటే అవకాశం ఉన్నట్లు ఆమె వివరించారు.

తీరం దాటే సమయంలో ఈదురుగాలులు 110 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. తీరం వెంట అలలు 1.5 మీటర్ల ఎత్తు ఎగిసి పడే అవకాశాలున్నట్లు ఆమె వివరించారు. బాపట్లకు అతి చేరువకు వచ్చి తీరం దాటే అవకాశాలున్నట్లు ఆమె పేర్కొన్నారు.

తుఫాన్‌ తీరం దాటిన తరువాత రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు డైరెక్టర్‌ సునంద వివరించారు.
ప్రస్తుతం తుఫాన్‌ ఒంగోలుకి 25 కిలో మీటర్ల దూరంలో, బాపట్లకు 60 కిలో మీటర్ల దూరంలో , మచిలీపట్నానికి 130 కిలో మీటర్ల దూరంలో తుఫాన్‌ ఉన్నట్లు ఆమె వివరించారు.

publive-image

ఇప్పటికే మచిలీపట్నం నుంచి కృష్ణపట్నం వరకూ అన్ని పోర్టులకు హెచ్చరికలు జారీ చేసినట్లు ఆమె అన్నారు. ప్రజలు మరింత అప్రమత్తం గా ఉండాలని విపత్తుల సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బిఆర్ అంబేద్కర్ వివరించారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరు బయటకు రావద్దని హెచ్చరించారు.

ఇప్పటికే మిచౌంగ్‌ తుఫాన్‌ దెబ్బకి బాపట్ల పరిసర ప్రాంతాల్లోని పొలాలు చెరువులను తలిపిస్తున్నాయి. రాష్ట్రంలో గత రెండు రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండడంతో వేరుశెనగ మిర్చి పంటలు మొత్తం నీట మునిగిపోయాయి. వేల ఎకరాల్లో మిర్చి శెనగ పంట నీట మునిగిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

దర్శి లో భారీ వర్షంతో రోడ్లు నీట మునిగాయి..దీంతో రాకపోకలు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పంట పొలాలు నీటిలో నానుతుండడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Also read: ఏపీ తీరం వెంబడి అల్లకల్లోలం సృష్టిస్తున్న మిచౌంగ్‌..పలు చోట్ల ముందుకు వచ్చిన సముద్రం

Advertisment
తాజా కథనాలు