Cyber Crime: సైబర్‌ నేరగాళ్ల వలలో పడి రూ.7.50 లక్షలు పోగొట్టుకున్న యువతి

సైబర్ నేరగాళ్ల మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ సైబర్ నేరగాడు క్రెడిట్ కార్టు చెల్లింపుల పేరుతో హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళకు వల వేసి రూ.7.50 లక్షలు దోచుకున్నాడు. మోసపోయానని గ్రహించిన ఆ మహిళ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది.

New Update
Cyber Crime: సైబర్‌ నేరగాళ్ల వలలో పడి రూ.7.50 లక్షలు పోగొట్టుకున్న యువతి

సైబర్ నేరగాళ్ల మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా క్రెడిట్ కార్టు చెల్లింపుల పేరుతో నగరానికి చెందిన ఓ మహిళ రూ.7.50 లక్షలు మోసపోయింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన ఓ యువతికి ఒక సైబర్ నేరగాడు ఫోన్ చేశాడు. మీ క్రెడిట్ కార్డు నుంచి చెల్లించాల్సిన మొత్తం రాలేదని చెప్పాడు. దీంతో ఆమె అసలు నాకు క్రెడిట్ కార్డు లేదని చెప్పింది. ఆ సైబర్ నేరగాడు తమ కస్టమర్ కేర్‌తో మాట్లాడాలని సూచించి మరో వ్యక్తికి కాల్ ఫార్వర్డ్ చేశాడు.

Also read: తెలంగాణలో రాగల ఐదు రోజులు వర్షాలు..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌!

అతడు.. బాధితురాలి ఆధార్ తనిఖీ చేసి.. ముంబయి, తమిళనాడు, బిహార్‌తో సహా మరో ప్రాంతంలో ఆమె పేరు మీద క్రెడిట్ కార్టులు ఉన్నాయని చెప్పాడు. ఆ క్రెడిట్ కార్డుల నుంచి రూ.25-30 లక్షల నగదు ట్రాన్స్‌ఫర్ అయ్యాయంటూ బెదిరించాడు. ఆమెపై మనీలాండరింగ్ చట్టం ప్రకారం కేసు అవుతుందంటూ భయపెట్టాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని.. సీబీఐ విచారిస్తున్నప్పుడు విషయం చాలా రహస్యంగా ఉంచాలని సూచనలు చేశాడు. ఇప్పుడు కేసు దర్యాప్తు చేస్తున్నామని.. తాము సూచించిన అకౌంట్‌కు రూ.7.50 లక్షలు బదిలీ చేయాలని అన్నాడు. దర్యాప్తు పూర్తయ్యాక ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని చెప్పాడు. అతడు చెప్పిన మాయమాటల్ని ఆ యువతి నమ్మింది. డబ్బులు చెల్లించింది. ఆ బాధితురాలు తన మిత్రులకు ఈ విషయాన్ని చెప్పగా తాను మోసపోయినట్లు గ్రహించింది. చివరికి తనకు న్యాయం చేయాలని సైబర్ క్రైమ్‌ విభాగంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Also read: మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

Advertisment
తాజా కథనాలు