CYBER ALERT : ప్రజాపాలననూ వదలని సైబర్ నేరగాళ్లు ప్రజాపాలన దరఖాస్తుదారులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. 'మీ వివరాలు, ఓటీపీలు ఎవరికీ చెప్పకూడదు. ఎవరైనా మోసాలకు గురైతే వెంటనే 1930కు కాల్ చేయండి. https://cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలి' అని సూచించారు. By srinivas 08 Jan 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి Praja Palana : తెలంగాణ(Telangana) లో ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజాపాలన(Praja Palana) పేరుతో కాంగ్రెస్ గవర్నమెంట్(Congress Government) స్వీకరించిన దరఖాస్తులపై సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) కన్నేశారు. అమాయకులే లక్ష్యంగా ఆన్ లైన్(Online) వేదికగా మోసాలకు పాల్పడుతున్నారు. రేషన్ కార్డు, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్ల కోసం అప్లికేషన్స్ చేసుకున్న వారిని టార్గెట్ చేసుకుని.. ఓటీపీ ల పేరుతో దోపిడీలకు పాల్పడుతున్నట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి దాదాపు కోటి ఏనభై లక్షల ధరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో అభయహస్తం(Abhaya Hastham) కింద కోటి యాభై లక్షలు దరఖాస్తులు రాగా, రేషన్‌కార్డు, ఇతర అంశాలకు సంబంధించి ఇరవై లక్షల వరకూ అప్లికేషన్ పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రజాపాలన దరఖాస్తు మాటున సైబర్ ముప్పు పొంచి ఉందని, దరఖాస్తుదారులు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. 1930కు కాల్ చేయండి.. 'మీరు ఇచ్చిన దరఖాస్తు అర్హత సాధించిందని, పేరు, రసీదు వివరాలు, ఫోన్ నంబర్, బ్యాంక్ వివరాలు చెప్పాలంటూ ఫేక్ కాల్స్ వచ్చే అవకాశం ఉంది. అపరిచితులు పంపే లింక్‌పై క్లిక్‌చేయకూడదు. ఓటీపీ(OTP) చెప్పాలంటూ వచ్చే కాల్స్ ఎవరూ నమ్మకూడదు. ఆరు గ్యారెంటీల్లో ఎన్నింటికి అర్హత సాధించారనే విషయం అధికారులే చెబుతారు. ఎవరికీ మీ వివరాలు చెప్పకూడదు. ఎవరైనా ఇలాంటి మోసాలకు గురైతే వెంటనే 1930కు కాల్ చేయండి. https://cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలి' అని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. సర్వర్ ప్రాబ్లమ్.. మరొకవైపు దరఖాస్తులను జనవరి 17లోగా డాటా ఎంట్రీ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే సీజీజీ అధికారులు అప్లికేషన్ రూపకల్పనలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో డాటా ఎంట్రీలో పలు సమస్యలు వెంటాడుతున్నట్లు తెలిపారు. సర్వర్ సమస్యతో అప్లికేషన్ పదేపదే లాగ్ అవుతోందని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ఆపరేటర్ రోజుకు 60-75 మించి దరఖాస్తులు చేయలేకపోతున్నాడని, దీనికితోడు ఆధార్‌కార్డు నంబర్‌ను 12 డిజిట్‌లకు పరిమితం చేయకుండా ఎన్ని నంబర్లు ఇచ్చినా తీసుకుంటుందన్నారు. దీనివల్ల ఒక్క నంబర్ తక్కువైనా, ఎక్కువైనా లబ్ధిదారుడు నష్టపోయే ప్రమాదం ఉండడంతో జాగ్రత్తగా ఎంట్రీ చేయాల్సి వస్తుందని, దీనికితోడు ఎడిట్ ఆప్షన్ కూడా లేకపోవడం మరింత సమస్యగా మారిందని ఆపరేట్లరు వాపోతున్నారు. ఇది కూడా చదవండి : Lok Sabha Election-2024: కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం.. పార్లమెంట్ నియోజకవర్గాల ఇంఛార్జీలు వీరే! రెండు కేసులు నమోదు.. ఇక ఇప్పటికే సైబర్ క్రైమ్ విభాగంలో రెండు కేసులు చేధించినట్లు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. డఫాబెట్ వెబ్‌సైట్‌లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని చెప్పి నిందితులు మోసాలు చేస్తున్నారని తెలిపారు. ఓ వ్యక్తి డఫాబెట్‌లో రూ. 70లక్షలు పెట్టి ఆన్‌లైన్ గేమ్ ఆడారని, ఆ తర్వాత మోసపోయానని గ్రహించి ఫిర్యాదు చేశారని అన్నారు. హైదరాబాద్‌కు చెందిన సదరు వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. హరియాణాకు చెందిన హితేశ్ గోయల్ మోసాలకు పాల్పడగా.. నిందితుడిని ఢిల్లీలో అరెస్టు చేసి రూ.1.40 కోట్ల నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. యూనిటీ స్టాక్స్ పేరుతో ఆన్‌లైన్ మోసాలు చేస్తున్న మరో వ్యక్తిని కూడా అరెస్టు చేశామని హైదరాబాద్ సీపీ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన బాధితురాలు రూ3.16 కోట్లు నష్టపోయానని ఫిర్యాదు ఇచ్చిందని అన్నారు. నిందితుడు రోనక్ తన్నాను అరెస్టు చేశారని తెలిపారు. రోనక్ తన్నా దుబాయ్ నుంచి మోసాలకు పాల్పడేవాడని చెప్పారు. నిందితుల బ్యాంక్ ఖాతాలోని రూ.20 లక్షలు ఫ్రీజ్ చేశామన్నారు. నిందితుడికి సహకరించిన మరో ఇద్దరికి నోటీసులు జారీ చేశారని అన్నారు. నిందితుడు 95 బ్యాంకు ఖాతాలు వాడుతున్నట్లు గుర్తించామని తెలిపారు. ఇది కూడా చదవండి : BREAKING: జగన్‌కు మరో బిగ్ షాక్.. సమ్మెకు 108, 104 సిబ్బంది! ఎప్పటినుంచంటే? #telangana #applications #cyber-criminals #praja-palana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి