AP: ఈ అంశంపై కేంద్రం పునరాలోచించాలి: రఘువీరా రెడ్డి

గుండుమలలో ప్రభుత్వ కార్యక్రమాన్ని హంగు ఆర్భాటం లేకుండా సాదాసీదాగా సీఎం చంద్రబాబు నిర్వహించడం చాలా సంతోషమన్నారు CWC మెంబర్ రఘువీరా రెడ్డి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పు హర్షనీయమన్నారు. దేశవ్యాప్తంగా కుల గణన జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

New Update
AP: రాజధానికి రూ. 15 వేల కోట్లు.. అప్పుగా ఇస్తున్నారా? అభివృద్ధి కోసమే ఇస్తున్నారా?: రఘువీరారెడ్డి

CWC Raghuveera Reddy: సత్యసాయి జిల్లా మడకశిర మండలం గుండుమలలో సీఎం చంద్రబాబు పర్యటనపై CWC మెంబర్ రఘువీరా రెడ్డి స్పందించారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని హంగు ఆర్భాటం లేకుండా సాదాసీదాగా సీఎం చంద్రబాబు నడిపించడం చాలా సంతోషంగా ఉందన్నారు. బలవంతపు జన సమీకరణ చేయకుండా రైతులు, ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలకు పరిష్కార మార్గం చూపడం చాలా గొప్పతనంగా భావించవచ్చన్నారు.

గతంలో జన సమీకరణలు అవసరమని.. ఇప్పుడు సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా బలోపేతం కావడంతో జన సమీకరణ అవసరం లేకుండా పోయిందన్నారు. ఇంత సాదాసీదాగా సీఎం చంద్రబాబు ప్రభుత్వ కార్యక్రమం జరపడంపై హర్షం వ్యక్తం చేశారు. గత పది ఏళ్లుగా మడకశిరలో అనేక సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారని.. వాటిని త్వరితగతిన పరిష్కరించే మంచి అవకాశం ఆ దేవుడు సీఎం చంద్రబాబుకు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.

Also Read: ఒక్కరోజులోనే ఇలా చేయడం హ్యాపి : సీఎం చంద్రబాబు

సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై తీర్పు వెలువరించడం శుభ పరిణామం అన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ ఇప్పుడు పరిస్థితుల్లో చాలా అవసరమన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై తీవ్ర పోరాటం చేసిన మందకృష్ణ మాదిగకు అభినందనలన్నారు. కేంద్ర ప్రభుత్వం కక్షపూరిత ధోరణి విడనాడి దేశవ్యాప్తంగా కుల గణన జరిపించాలన్నారు. కులగణన జరిగితేనే ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని కోరారు.

కేరళలో భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వర్షంలోనే తడుచుకుంటూ పర్యటించడం హర్షనీయమన్నారు. వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సహకరిస్తామని రాహుల్ గాంధీ చెప్పడం స్ఫూర్తిదాయకమన్నారు. వాయినాడుకు రాజీనామా చేసినప్పటికీ రాహుల్ గాంధీ వరద ప్రాంతాలను పర్యటించి బాధితులను పరామర్శించారన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు