IPL 2024: నేడు చెన్నై వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్!

ఐపీఎల్ 22 వ మ్యాచ్ చెన్నై,కేకేఆర్ మధ్య సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ జరగనుంది.ఈ మ్యాచ్ కు చెన్నైలోని చిదంబంరం స్టేడియం వేదిక కానుంది. అయితే వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయిన చెన్నై పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉన్న కోల్ కత్తా పై విజయం సాధించాలని వేచి చూస్తుంది.

IPL 2024: నేడు చెన్నై వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్!
New Update

CSK Vs KKR: నేడు IPL 2024 22వ మ్యాచ్  చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ (CSK vs KKR) మధ్య చెన్నైలోని MA చితంబరం స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది.చెన్నై జట్టు గత మ్యాచ్‌లో సన్ రైజర్స్ చేతిలో  ఓడిపోయింది..కాగా, కోల్‌కతా జట్టు అన్ని మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది. మ్యాచ్‌కు ముందు, రెండు జట్లు  సాధ్యమైన ప్లేయింగ్ XI మధ్య హెడ్ టు హెడ్ రికార్డును తెలుసుకుందాం. .

ఐపీఎల్‌లో ఇప్పటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings), కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు 29 సార్లు తలపడ్డాయి. ఈ సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ పైచేయి సాధించింది. చెన్నై మొత్తం 18 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. అదే సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ 10 సార్లు గెలిచింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగింసింది. కోల్‌కతా జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. కేకేఆర్ జట్టు ఆడిన  3 మ్యాచ్‌లలో 3 గెలిచి మంచి ఫాం లో ఉంది. అదే సమయంలో, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు 4 మ్యాచ్‌లలో 2 గెలిచింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు కొన్ని మార్పులు చేసే ఆలోచనలో ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, శివమ్ దూబే, సమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్.

కోల్‌కతా నైట్ రైడర్స్: ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), రింకూ సింగ్, వెంకటేష్ అయ్యర్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.

#shreyas-iyer #ipl-2024 #ruturaj-gaikwad #csk-vs-kkr
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe