CSIR : ఇక నుంచి ఆరోజున ముడతల దుస్తులే వేసుకోండి...ఉద్యోగులకు సీఎస్‌ఐఆర్‌ ఆదేశాలు!

కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సెర్చ్‌ రీసెర్చ్‌ సంస్థ ముడతలు పడ్డ దుస్తులనే వేసుకురావాలని ఉద్యోగులకు సూచించింది. ఈ మేరకు వాహ్‌ మండేస్‌ ను ప్రారంభించింది. wrinkles Acche hai అనే నినాదం కూడా తెలిపింది. పర్యావరణ హితం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

New Update
CSIR : ఇక నుంచి ఆరోజున ముడతల దుస్తులే వేసుకోండి...ఉద్యోగులకు సీఎస్‌ఐఆర్‌ ఆదేశాలు!

Wear Wrinkles Cloths  : సాధారణంగా పని చేసే కార్యాలయాలకు వెళ్తున్నామంటే మంచిగా ఉతికి ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకోవడం చూస్తుంటాం. మరి కొందరు అయితే చాలా ప్రొఫెషనల్ గా ఫార్మల్స్‌, ఇన్‌ షర్ట్‌, టై, షూస్‌ ఇలా వెళ్తుంటారు. కంపెనీలు కూడా తమ ఉద్యోగస్తులు హుందాగా ఉండాలనే కోరుకుంటాయి. కానీ ఇక్కడ ఓ కంపెనీ మాత్రం తమ ఉద్యోగులను ముడతలు పడ్డ దుస్తులను వేసుకుని రావాలని చెబుతుంది.

ప్రముఖ రీసెర్చ్‌ సంస్థ కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సెర్చ్‌(CSIR) ఇదే నిర్ణయం తీసుకుంది. ప్రతి సోమవారం రోజు ముడతలు పడ్డ దుస్తులనే వేసుకురావాలని ఉద్యోగులకు(Employees) సూచించింది. ఈ మేరకు వాహ్‌ మండేస్‌ ను ప్రారంభించింది. wrinkles Acche hai అనే నినాదం కూడా తెలిపింది. ఇదేంటి ఎవరైనా ఆఫీసులకు డీసెంట్‌గా రావాలని చెబుతారు.. కానీ ఇలా ముడతలు పడ్డ దుస్తులను ఎందుకు వేసుకురమ్మని ఆలోచిస్తున్నారా! ఇదేదో ట్రెండ్‌ అవ్వాలని తీసుకున్న నిర్ణయం కాదు. దీనివెనుక పెద్ద సామాజిక కోణమే ఉంది.

పర్యావరణ హితం కోసమే ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నామని సీఎస్‌ఐఆర్‌ మహిళా డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ఎన్‌. కలై సెల్వి వెల్లడించారు. సాధారణంగా ఒక జత దుస్తులను ఐరన్‌ చేసినప్పుడు 200 గ్రాముల కార్బన్‌ డయాక్సైడ్‌(Carbon Dioxide) విడుదలవుతుందని ఆమె చెప్పారు. దానిని నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. వారం పొడవునా కాకపోయినా కనీసం ఒక్క రోజు అయినా ఇలా ఇస్త్రీ లేని దుస్తులను ధరించేలా వాహ్‌ మండేస్‌ స్కీమ్‌ తీసుకొచ్చామని వివరించారు. ఇంధన అక్షరాస్యతలో భాగంగా విద్యుత్‌ వినియోగాన్ని 10 శాతం తగ్గించడంపై కూడా సీఎస్‌ఐఆర్‌ దృష్టి సారించింది.

Also read: నేడు ఏపీలో పిడుగులతో కూడి భారీ వర్షాలు!

Advertisment
తాజా కథనాలు