TG News : ఆసరా పింఛన్ల రికవరీ నోటీసులపై సీఎస్‌ కీలక ఆదేశాలు!

తెలంగాణలో సంక్షేమ పథకాల లబ్ధి పొందుతోన్న అనర్హులకు నోటీసులపై సీఎస్ శాంతకుమారి స్పందించారు. మార్గదర్శకాలు ఇచ్చే వరకు రికవరీ నోటీసులు ఇవ్వొద్దని అధికారులకు సూచించారు. అర్హులే లబ్ధి పొందేలా స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేస్తామని చెప్పారు.

Telangana: తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌లు బదిలీ
New Update

Telangana : తెలంగాణలో సంక్షేమ పథకాల లబ్ధి పొందుతోన్న అనర్హులకు నోటీసులపై సీఎస్ శాంతకుమారి (CS Shanti Kumari) స్పందించారు. సంక్షేమ పథకాల్లో కొంతమంది అనర్హులు లబ్ధి పొందుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇందుకు సంబంధించి అర్హులే లబ్ధి పొందేలా స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేస్తామని అన్నారు. మార్గదర్శకాలు ఇచ్చే వరకు రికవరీ నోటీసులు ఇవ్వొద్దని అధికారులకు సూచించారు. అనర్హులకు లబ్ధి, రికవరీపై అసెంబ్లీ సమావేశాల్లో (Assembly Meetings) చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆమె తెలిపారు.

రాష్ట్రంలో దారిద్య్రరేఖకు దిగువన ఉండే పేదలకు అందాల్సిన ఆసరా పింఛన్లు (Aasara Pensions) దుర్వినియోగమవుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వోద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ప్రభుత్వ కుటుంబ పింఛను పొందుతున్న వారు సైతం ‘ఆసరా’ పొందుతున్నట్లు వెల్లడైంది. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణలో బయటపడిన వారికి ఈ పింఛను రద్దు చేయడంతో పాటు గతంలో పొందిన మొత్తాన్ని రికవరీ చేయాలని ఆదేశించింది. అయితే, ఈ వ్యవహారంలో ప్రభుత్వంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసే వరకు రికవరీ నోటీసులు ఇవ్వొద్దని సీఎస్‌ ఆదేశాలు జారీ చేశారు.

Also Read : మెగా స్కామ్ 2024.. RTV చేతిలో సంచలన ఆధారాలు!

#telangana #cs-shanti-kumari #welfare-schemes #aasara-pensions
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe