Telangana Rains: తెలంగాణలో మరో 3 రోజులు వర్షాలు.. సీఎస్ కీలక ఆదేశాలు!
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కలెక్టర్లు, ఇతర అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.