Bandla Ganesh : మరో వివాదంలో బండ్ల గణేష్.. స్టార్ ప్రొడ్యూసర్ పై కేస్ పెట్టిన మహిళ? సినీ నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆయనపై ఓ మహిళా క్రిమినల్ కేసు పెట్టింది. ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో బండ్ల గణేష్ పై కేస్ నమోదయింది By Anil Kumar 06 May 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Criminal Case Filed On Bandla Ganesh : సినీ నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆయనపై ఓ మహిళా క్రిమినల్ కేసు పెట్టింది. ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో బండ్ల గణేష్ పై కేస్ నమోదయింది. ఫిలిం నగర్ లో తనకు సొంతమైన 75 కోట్ల విలువ గల ఇంటిని బండ్ల గణేష్ కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని హీరా గ్రూప్ సీఈవో (Heera group CEO) నౌహీరా షేక్ పోలీసులకు పిర్యాదు చేసింది. బండ్ల గణేష్ తన ఇంట్లో చాల కాలంగా అద్దెకు ఉంటున్నాడని, అక్కడ పలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడమే కాకుండా ఫోర్జరీ డాక్యుమెంట్స్ (Forged Documents) తో తన ఇంటిని సైతం కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు నౌహీరా తన ఫిర్యాదులో తెలిపింది. ఈ విషయం తనకు తెలిసి ఇంటిని ఖాళీ చేయమని అడిగేందుకు వెళితే.. తనను నిర్బంధించి బెదిరింపులకు పాల్పడుతున్ననట్లు వెల్లడించింది. Also Read : నవ్విస్తూనే భయం పుట్టించిన సినిమా సీక్వెల్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది పట్టించుకోని పోలీసులు బండ్ల గణేష్ తన ఇంటిని కబ్జా చేసేందుకు చూస్తున్నాడని, తనకు బెదిరిస్తున్నాడని నౌహీరా పోలీసుల దగ్గరికి వెళ్లి పిర్యాదు చేయగా.. వాళ్ళు దాన్ని పట్టించుకోవడమే కాకూండా తిరిగి తనపైనే కేసు నమోదు చేయడంతో నౌహీరా డీజీపీ కి పిర్యాదు చేసింది. ఉన్నతాధికారుల పిర్యాదు మేరకు బండ్ల గణేష్ పై ఫిలిం నగర్ పోలీసులు కేసు నమోదు చేసారు. నౌహీరా షేక్ ఎవరు? సుమారు 5 వేల కోట్ల మనీలాండరింగ్ కేసులో నౌహీరా షేక్ పై పలు అభియోగాలు ఉన్నాయి. హీరా గోల్డ్ సంస్థల ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజల నుండి నౌహీరా భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడింది. ఈ కుంభకోణంలో సుమారు లక్ష 72 వేల మందికి పైగా మోసపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసును ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. #cinema-news #bandla-ganesh #producer-bandla-ganesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి