NCRB Report:కాల్చుకుని తింటున్నారు...దేశంలో విపరీతంగా మహిళలపై వేధింపులు

ఎవరండీ భారతదేశంలో స్త్రీలు స్వేచ్ఛగా బుతుకుతున్నారు అని చెబుతున్నారు. వాళ్ళకు ఒక్కసారి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికను చూపించండి. గతేడాదితో పోలిస్తే మహిళల మీద నేరాలు నాలుగు శాతం పెరిగింది.

NCRB Report:కాల్చుకుని తింటున్నారు...దేశంలో విపరీతంగా మహిళలపై వేధింపులు
New Update

భారతదేశంలో మహిళలు ఎప్పటికీ సురక్షితం కాదని మరొకసారి నిరూపితమయింది. ఎంత పోరాడుతున్నా వారి మీద జరిగే నేరాలను మాత్రం ఎవ్వరూ ఆపలేకపోతున్నారు. పోనీ కనీసం తగ్గుతున్నాయా అంటే అదీ లేదు...ఏడాది ఏడాదికీ పెరుగుతూనే ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడు మహిళలమీద నేరాలు నాలుగు శాతం పెరిగినట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదిక విడుదల చేసింది. ఈ నివేదికలో పిల్లలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగలు, సైబర్ నేరాలను బయటపెట్టింది. మొత్తం 4,45,256 కేసులు నమోదయ్యాయని తెలిపింది.

Also Read:ఇంకా వీడని సీఎం సస్పెన్స్.. మెజార్టీ ఎమ్మెల్యేలు ఆయనవైపే మొగ్గు

ఎప్పటిలాగే ఇండియాలో అన్నింటికన్నా అసురక్షిత నగరంగా దేశ రాజధాని ఢిల్లీనే తేలింది. 2022లో ఢిల్లీలో 1,204 అత్యాచార కేసులు నమోదయ్యాయి. దేశంలో స్త్రీల మీద నమోదైన మొత్తం నేరాల్లో 31.20 శాతం ఉన్నాయి. దీన్నిబట్టి ఢిల్లీలో ప్రతీరోజూ సగటుకు 3 అత్యాచారాలు నమోదవుతున్నాయి. ఇవి కేవలం రికార్డ్ అయిన లెక్కలు మాత్రమే. అవ్వకుండా ఇంకా ఎన్ని ఉన్నాయో ఆ భగవంతుడికే తెలియాలి.

ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం మెట్రోపాలిటన్ నగరాల్లో మొత్తం 48,755 కేసులు నమోదయ్యాయి. ఇందులో ఢిల్లీలో 14,158 కేసులు ఉండగా...తరువాతి స్థానంలో ముంబై 6,176 కేసులతో ఉంది. సైబర్ నేరాల్లో కూడా ఢిల్లీ నంబర్ వన్ గానే ఉంది. 2021లో 345 సైబర్ కేసులు నమోదయితే 2022 వచ్చేసరికి ఇవి 685 పెరిగాయి. ఇందులో 331 సైబర్ ఫ్రాడ్, 55 కంప్యూటర్ సంబంధిత నేరాలు, ఐదు మోసం ఘటనలు ఉన్నాయి. అసభ్యకర వీడియోల కేసులు 184, ఆన్ లైన్ లో అశ్లీలరాతలు రాయడం లేదా ప్రచారం చేయడం లాంటివి 21 కేసులు నమోదయ్యాయి.

గృహహింస...

ఇందులో కూడా మన భారతీయులు ఏ మాత్రం తగ్గడం లేదు. అన్నింటికంటే ఎక్కువగా ఉత్తరప్రదేశ్ లో మహిళలమీద గృహహింస జరుగుతోంది. ఇక్కడ గృహహింస కింద 65,743 నేరాలు నమోదయ్యాయి. దీని తరువాతి స్థానంలో మహారాష్ట్ర 45,058 కేసులతో మహారాష్ట్ర, రాజస్థాన్ ఉన్నాయి. ఇక అత్యాచార కేసుల కింద 2022కి గానూ 31,516 కేసులు నమోదుకాగా..అందులో రాజస్తాన్ లో అత్యధికంగా 5,399...ఉత్తరప్రదేశ్ లో 3,690, మధ్యప్రదేశ్ లో 3,029 కేసులు రికార్డ్ అయ్యాయి. ఎన్సీఆర్బీ నివేదక ప్రకారం 31.4శాతం కేసులలో గృహహింసకు పాల్పడుతూ భర్తలు లేదా బంధువులు చాలా క్రూరంగా ప్రవర్తించారు. ఇక 19.2 శాతం మహిళల కిడ్నాప్, అపహరణ కేసులు నమోదయ్యాయి. రేప్ కేసులు 7.1శాతం ఉన్నాయి.

#crime #women #report #ncrb
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe