పది కోట్లు ఇస్తే ఏమైనా చేస్తా.. హర్షసాయి సంచలన ఆడియో లీక్! యూట్యూబర్ హర్షసాయి మరో ఆడియో సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. 'రూ.10 కోట్లు ఇస్తే ఏమైనా చేస్తా. నా బ్రాండ్ వాల్యూ తగ్గించుకోను. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే ఎంతైనా ఇస్తారు. ఈ విషయం ఎవరి వద్ద డిస్కస్ చేయకు' అంటూ హర్ష మాట్లాడిన ఆడియో వైరల్ అవుతోంది. By srinivas 28 Sep 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Harsha Sai: యూట్యూబర్ హర్షసాయికి సంబంధించిన మరో సంచలన ఆడియో బయటకొచ్చింది. తన విలువ రూ.10 కోట్లు అని, అడిగినంత ఇస్తే ఏమైనా చేస్తానంటూ చెప్పిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మేరకు 'నా వాల్యూ పది కోట్ల రూపాయలు. రూ.10 కోట్లు ఇస్తే ఏమైనా చేస్తా. నా బ్రాండ్ వాల్యూ తగ్గించుకోను. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే ఎంతైనా ఇస్తారు. అయినా నేను కాకపోతే మరొకరితో ప్రమోట్ చేయించుకుంటారు. ఈ విషయం ఎవరి వద్ద డిస్కస్ చేయకు' అంటూ హర్ష మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. ఇదిలా ఉంటే.. పరారిలో ఉన్న హర్ష బెంగళూరు లేదా గోవాకు పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. 4 ఎస్‌వోటీ పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. హర్షసాయి ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండటంతో పట్టుకోవడం పోలీసులకు కష్టంగా మారింది. ఇక హర్షసాయి తెరకెక్కించిన 'మెగా' అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన 'మిత్ర శర్మ' తనమీద అత్యాచారం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు కూల్ డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి స్పృహలో లేనప్పుడు అత్యాచారం చేస్తూ వీడియో రికార్డు చేసినట్లు తెలిపింది. అంతేకాదు దాన్ని చూపించి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే దీనిపై స్పందించిన హర్ష.. అవన్నీ తప్పుడు ఆరోపణలు, కేవలం డబ్బు కోసమే తన మీద ఇలాంటి ఆరోపణలు చేస్తుందన్నాడు. Also Read : గ్రూప్-1 అభ్యర్థులకు షాక్.. పరీక్ష మళ్లీ రద్దు అవుతుందా? #tollywood #social-media #harsha-sai సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి