Road Accident: వీడియో - ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు ఉద్యోగులు మృతి

UPలోని ఉన్నావ్ జిల్లా లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి పక్కరోడ్డులోకి వెళ్లి బ్యారియర్‌లు ఏర్పాటు చేస్తున్న నలుగురు ఉద్యోగులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు.

New Update
Road Accident

Uttar Pradesh unnao lucknow agra expressway accident 4 killed

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లా లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా నుండి లక్నోకు ప్రయాణిస్తున్న హర్యానా రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన ఎర్టిగా కారు.. ఒక్కసారిగా డివైడర్‌ను క్రాస్ చేసి, మరొక లైన్‌లోకి వెళ్లి బోల్తా పడి.. అదే ఎక్స్‌ప్రెస్‌వేపై పనిచేస్తున్న యుపిడిఎ ఉద్యోగులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు ఉద్యోగులు అక్కడికక్కడే మరణించగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బెహ్తా ముజావర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం 11:30 గంటల ప్రాంతంలో జరిగింది. 

Unnao Road Accident

మృతులంతా అదే పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందినవారుగా గుర్తించారు. వారు ఎక్స్‌ప్రెస్‌వేలోని రెండవ లేన్‌లో చెట్లు, గడ్డిని నరుకుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులను 40 ఏళ్ల లవ్‌కుష్, 38 ఏళ్ల గోకరన్, 45 ఏళ్ల ముఖేష్, 35 ఏళ్ల సర్వాన్‌గా గుర్తించారు. అదే సమయంలో తీవ్రంగా గాయపడిన కృష్ణపాల్ (55), రాజేష్ (40) లను వెంటనే లక్నో ట్రామా సెంటర్‌కు తరలించారు. 

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న గ్రామస్థులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున రోడ్డుపై గుమిగూడారు. దీంతో చాలా సేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆపై పోలీసులు సంఘటనా స్థలంలోనున్న జనాన్ని చెదరగొట్టి ట్రాఫిక్ క్లియర్ చేశారు. మృతదేహాలను అదుపులోకి తీసుకుని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం పంపారు.

అయితే టైర్ పగిలిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అడిషనల్ పోలీసు సూపరింటెండెంట్ (సౌత్) ప్రేమ్ చంద్ర తెలిపారు. మూడు పోలీస్ స్టేషన్ల నుండి పోలీసులను సంఘటనా స్థలానికి పంపించారు. ఈ ఘటన తర్వాత ఆ కారు డ్రైవర్ సంఘటన స్థలం నుండి పారిపోయాడు. అతడిపై కేసు నమోదు చేసి ప్రస్తుతం అతని కోసం వెతుకుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు