Exam fee : ఫీజు కట్టలేదని ఎగ్జామ్ రాయనివ్వలేదు.. ఎంత బతిమిలాడిన పట్టించుకోకపోవడంతో

ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో దారుణం జరిగింది. స్కూల్ ఫీజు రూ. 800 చెల్లించలేదని పాఠశాల యజమాన్యం పరీక్ష రాయకుండా అడ్డుకోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య 13 ఏళ్ల బాలిక రియా ప్రజాపతి చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

New Update
exam-fee-up

exam-fee-up

ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో దారుణం జరిగింది. స్కూల్ ఫీజు రూ. 800 చెల్లించలేదని పాఠశాల యజమాన్యం పరీక్ష రాయనివ్వకుండా అడ్డుకోవడంతో మనస్తాపం చెందిన 13 ఏళ్ల బాలిక రియా ప్రజాపతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.  9వ తరగతి విద్యార్థిని అయిన రియా శనివారం రోజున పరీక్ష రాయడానికి పాఠశాలకు వెళ్లింది. అయితే నువ్వు ఇంకా రూ.  800 ఫీజు కట్టాలని అప్పటివరకు పరీక్ష రాసేది లేదంటూ ప్రిన్సిపాల్ రాజ్ కుమార్ యాదవ్ ఇతర సిబ్బంది ఆ బాలికను పరీక్ష రాయనివ్వలేదు.  

Also read :  Afghanistan: ఆఫ్గాన్‌కు కొత్త చట్టాలేమి అవసరం లేదంటున్న తాలిబాన్‌ చీఫ్‌!

Also read :  Aniket Verma : వర్త్ వర్మా వర్తు..  చిన్నప్పుడే తల్లిని కోల్పోయి..మామయ్య లోన్లు తీసుకుని ట్రైనింగ్!

ఎంత బ్రతిమిలాడిన కరుణించలేదు

ఎంత బ్రతిమిలాడిన కరుణించలేదు. వారి ప్రవర్తనతో కలత చెందిన ఆ బాలిక ఇంటికి వెళ్లి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. పొలం పనులకు వెళ్లిన రియా తల్లి పూనమ్ దేవి ఇంటికి తిరిగి వచ్చేసరికి కూతురు ఆత్మహత్య చేసుకుని కనిపించింది. దీంతో ఆమె విషయం తెలుసుకుని పాఠశాల యజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.  పాఠశాల అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరింది.  

Also read :  ఒప్పందం చేసుకోండి..లేకపోతే బాంబు దాడులే..ట్రంప్‌ హెచ్చరికలు!

ఇప్పటికే రూ. 1500 ఫీజు చెల్లించామని.. మరో రూ. 800ఫీజు చెల్లించాల్సి ఉందని ఆమె తన ఫిర్యాదులో వెల్లడించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఆమె ఫిర్యాదు మేరకు గానూ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 107 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు రియా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం తరలించారు. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.  

Also Read : Horoscope:ఈ రాశులవారు ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి...!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు