/rtv/media/media_files/2025/03/20/TEhHXpySFRHLUk9dnZL5.jpg)
Meerut murder case
Meerut Murder Case: ఉత్తరప్రదేశ్ మీరట్ లో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ముస్కాన్ కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ముస్కాన్ ప్రియుడు సాహిల్ ఇంట్లో పోలీసులు విస్తుపోయే దృశ్యాలను చూశారు. విచారణలో భాగంగా పోలీసులు నిందితుడు సాహిల్ ఇంటికి వెళ్ళినప్పుడు.. అక్కడ గోడలపై లార్డ్ భోలేనాథ్ ఫోటో, ఎరుపు, నలుపు రంగుల్లో చెక్కబడిన మర్మమైన తాంత్రిక చిహ్నాలు, ఆంగ్లంలో వ్రాయబడిన కొన్ని వింత వ్యాఖ్యలను కనిపెట్టారు.దీంతో పోలీసులు సాహిల్ కేవలం ఒక హంతకుడు మాత్రమే కాదు మూఢనమ్మకాలు, చేతబడికి గుడ్డి భక్తుడని పోలీసులు అనుమానిస్తున్నారు. సౌరబ్ హత్య ప్రియురాలి కోసమేనా లేక దీని వెనుక ఏదైనా భయంకరమైన రహస్యం దాగి ఉందా? అనే కోణాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Also Read: UP Crime: భర్తను చంపి.. సిమెంట్ డ్రమ్‌లో కలిపేసి: ప్రియుడికోసం నేవి అధికారి భార్య ఘోరం!
How you CAN’T get away with murder!
— Nabila Jamal (@nabilajamal_) March 19, 2025
Saurabh Rajput, a Merchant Navy officer brutally stabbed and dismembered by his wife Muskan Rastogi and her lover Sahil Shukla on March 4th
The duo sealed his remains in a plastic drum with cement, trying to erase all traces
Adding to the… pic.twitter.com/y1XX4WAjGP
బతికే అర్హత లేదు
ఇది ఇలా ఉంటే.. నిందితురాలు ముస్కాన్ ను ఆమె తల్లిదండ్రులు అసహ్యించుకుంటున్నారు. ఆమె తండ్రి ప్రమోద్ రస్తోగి మాట్లాడుతూ.. తన బిడ్డ క్షమించారని తప్పు చేసింది. సాహిల్ మాయలో పడి సౌరభ్ ను చంపేసింది. ఇంత దారుణానికి పాల్పడిన ఆమెకు ఉరే సరి. ఈ విషయంలో సౌరభ్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని తెలిపారు.
అయితే మర్చంట్ నేవీ ఉద్యోగిగా లండన్ లో పనిచేస్తున్న సౌరవ్ కుమార్ 2016 లో ముస్కాన్ ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇది ఇంట్లో వాళ్ళకి నచ్చకపోవడంతో గత మూడు సంవత్సరాలుగా సౌరభ్ తన భార్య ముస్కాన్‌తో కలిసి ఇందిరానగర్‌లోని అద్దె ఇంట్లో నివసించడం ప్రారంభించాడు. కాగా, భర్త ఉద్యోగరిత్యా లండన్ వెళ్లడంతో.. ఆ గ్యాప్ లో సాహిల్ కి దగ్గరైంది ముస్కాన్. ఈ క్రమంలోనే మార్చి 14న ప్రియుడు సాహిల్ తో కలిసి భర్తను దారుణంగా హత్య చేసింది.
Also Read: అసభ్యకర స్టెప్పులేస్తే దబిడి దిబిడే.. ఫిల్మ్ ఇండస్ట్రీకి మహిళా కమీషన్ వార్నింగ్