/rtv/media/media_files/2024/12/06/eMZeN8TDHvWBA1cAT83I.jpg)
ఛత్తీస్‌గడ్ - తెలంగాణ సరిహద్దుల్లోని జీడిపల్లి బేస్ క్యాంప్‌పై మావోయిస్టులు దాడి చేశారు. బీజాపూర్ భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య రాత్రి నుంచి భీకర ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. జీడిపల్లి-2 క్యాంపును గత రెండు రోజుల కిందటే ప్రారంభించారు. బేస్ క్యాంప్ ఔటర్ కార్డన్‌లో భద్రత కొరకు జవాన్లను ఉంచారు.
ఇది కూడా చూడండి: శబరిమల యాత్రికులకు గుడ్‌న్యూస్.. దర్శనానికి ప్రత్యేక పోర్టల్
ఇద్దరు జవాన్లకి తీవ్రంగా గాయాలు..
వారిపై మావోయిస్టులు కాల్పులు జరపగా జవాన్లు దాడులను తిప్పికొట్టారు. గంట పాటు జరిగిన ఈ భీకర కాల్పుల్లో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వీరిలో ఒకరి పరిస్థితి కాస్త విషమంగా ఉంది. జవాన్లపై కాల్పులు జరిపిన మావోయిస్టుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇది కూడా చూడండి: రిక్టర్ స్కేల్‌పై 7.0 తీవ్రతతో భారీ భూకంపం.. ఎక్కడంటే?
ఇదిలా ఉండగా ఇటీవల ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం చల్పాక అటవీ ప్రాంతంలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఓరుగల్లులో ఇదే భారీ ఎన్ కౌంటర్. కాగా ఏటూరునాగారం ఏజెన్సీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మిలటరీ బలగాలు తెలంగాణ అడవుల్లో జల్లెడ పడుతున్నారు. తెలంగాణ, ఏపీలో తలదాచుకోవాలని చూస్తున్న మావోయిస్టులకు పోలీసులు ఊహించని షాక్ ఇస్తున్నారు.
ఇది కూడా చూడండి: నేటి నుంచే గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు
ముఖ్యంగా తెలంగాణ సరిహద్దు ప్రాంతాలైన ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాల్ పల్లిలో భద్రతా బలగాలు ప్రత్యేక నిఘా పెట్టి ఒక్కరు కూడా రాష్ట్రంలోకి అడుగుపెట్టకుండా జాగ్రత్తపడుతున్నారు. వరుస ఎన్‌కౌంటర్లు జరుగుతుండటంతో పోలీసులు చిన్న చిన్న టీమ్‌లుగా తయారయ్యి మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నారు. మావోయిస్టుల కోసం ప్రత్యేక ఆపరేషన్లను కూడా పోలీసులు చేపడుతున్నారు.
ఇది కూడా చూడండి: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఒకేసారి రెండు కోర్సులు