/rtv/media/media_files/2025/05/16/5ZtlSQMySrtGi06wbyrA.jpg)
gold-jeweler
బంగారం ధరలు మరోసారి షాకిచ్చాయి. వరుసగా రెండు రోజులు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మరోసారి పెరిగాయి. 2025 మే 16వ తేదీ శుక్రవారం రోజున 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1100 పెరిగి రూ. 87 వేల 200కు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1200 పెరిగి రూ. 95 వేల 130కి చేరుకుంంది. దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87 వేల350 గాఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 95 వేల130గా ఉంది. ఇక ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87 వేల350 గాఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 95 వేల130గా ఉంది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87 వేల200 గాఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 95 వేల130గా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87 వేల200 గాఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 95 వేల130గా ఉంది.
వెండి ధరలు మాత్రం స్థిరంగా
బంగారం ధరలు పరుగులు పెట్టగా వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. 2025 మే 16వ తేదీ శుక్రవారం రోజున కేజీ వెండి ధర మార్కెట్ లో రూ. 1, 08,000గాఉంది. చెన్నై, హైదరాబాద్ లో రూ. 1, 08,000గా ఉండగా.. ముంబై, ఢిల్లీ, కోల్ కత్తాలో రూ. 97 వేలుగా ఉంది. బంగారం ధరలు స్థానికంగా సమయాన్ని బట్టి మారుతూ ఉంటుంది. వినియెగదారులు వీటిని గమనించాల్సి ఉంటుంది.